మందారంతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

Diseases Are Cured With Hibiscus Flowers,Diseases Are Cured With Hibiscus,Cured With Hibiscus Flowers,Hibiscus Flowers,Hibiscus,Diseases, Benefits of Hibiscus,Health benefits and risks,Hibiscus Uses, Hibiscus Benefits,Live Updates,Politics,Political News, Mango News, Mango News Telugu
Diseases are cured with hibiscus flowers,benefits with hibiscus,Hibiscus leaves,hibiscus flowers

ఒకప్పుడు మందార పూలంటే.. దేవుడికి అలంకరించడానికే అనుకునేవారు. తర్వాత ఆయుర్వేద మందులలో కూడా మందారాన్ని ఉపయోగిస్తున్నారు. మందారం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మందార పూలతో పాటు ఆకులు కూడా బాగా ఉపయోగపడతాయి. పూలను ఎండబెట్టి పొడిగా చేసుకుని, పూలతో డికాక్షన్ పెట్టుకుని మందారాన్ని వాడొచ్చు.

డయాబెటిస్ ను కంట్రోల్ చేయడంలో మందారం బాగా ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.  ఇప్పుడు చాలా మంది డయాబెటిస్ తో బాధపడుతున్నారు. అయితే స్టడీ ప్రకారం మందారంలో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉన్నాయి. ఇది బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ ని తగ్గిస్తుంది. మందారం డికాషన్ తీసుకోవడం వల్ల హైబీపీ సమస్య తగ్గుతుంది. కనుక హైబీపీ తో బాధపడే వాళ్లు బీపీ తగ్గించుకోవడానికి మందారం ఉపయోగిస్తే చక్కటి బెనిఫిట్ పొందొచ్చు.

గుండెను పదిలంగా ఉంచడానికి మందారం ఎంతగానో ఉపయోగపడుతుంది. గుండెల్లో ఇంఫ్లేమేషన్ తగ్గించడానికి కూడా మందారపూల పాత్ర కీలకం. అదే విధంగా కార్డియోవాస్క్యులర్ సమస్యలు తగ్గిస్తుంది. మలబద్దకంతో బాధపడే వాళ్లకు మందారం బాగా ఉపయోగపడుతుంది. గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సమస్యలని మందారం తరిమికొడుతుంది.

చర్మానికి మంచిది..

చర్మానికి కూడా మందారం ఎంతో మేలు చేస్తుంది. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ తొలగించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అదే విధంగా చర్మాన్ని సాఫ్ట్ గా ఉంచుతుంది. ఒబెసిటీను తగ్గించడంలో, కొలెస్ట్రాల్ తగ్గించడంలో కూడా మందారం బాగా ఉపయోగపడుతుంది అదే విధంగా బరువు కూడా తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. మందార ఆకులు మరియు మందార రేకులు కూడా నేచురల్ కండీషనర్ లాగ పనిచేస్తాయి. అదేవిధంగా జుట్టుని మరింత నల్లగా మారుస్తుంది. చుండ్రు సమస్యని కూడా తగ్గిస్తుంది. మందారాన్ని ఉపయోగించడం వల్ల స్కిన్ కేన్సర్ సమస్య కూడా తగ్గుతుంది. ఇలా మందారంతో ఎన్నో లాభాలని మనం పొందొచ్చు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ