ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి డిసెంబర్ 31వ తేదీ చివరి రోజు. దీనిని ఉల్లంఘిస్తే 5 వేల రూపాయల నుంచి 10 వేల రూపాయల వరకు జరిమానా విధిస్తారు. అలాగే, చెల్లించాల్సిన మొత్తంపైన కూడా వడ్డీ విధించబడుతుంది.
ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్ కు సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ను తెలుసుకోవాలి. లేదంటే చిన్నచిన్న పొరపాట్లు చేసినా పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. సాధారణంగా జూలై 31, 2024 ఆదాయపు పన్ను దాఖలుకు చివరి తేదీగా ఉండేది. ఈ తేదీని మిస్ అయిన వ్యక్తులు తప్పనిసరిగా డిసెంబర్ 31, 2024లోపు తమ ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయాలి. 2024-25 పన్ను దాఖలు కోసం లేట్ ట్యాక్స్ ఫైలింగ్ రుసుము 5,000 రూపాయలు చెల్లించాలి.
లేట్ ట్యాక్స్ ఫైలింగ్.. ఆదాయపు పన్ను చట్టంలోని.. సెక్షన్ 139(1) కింద వర్తిస్తుంది. ఇది గడువు తేదీకి కానీ అంతకు ముందు చెల్లింపులు చేయని ఆదాయాన్ని సూచిస్తుందన్నమాట. ఇది సెక్షన్ 139(4) కింద ఆలస్యమైన ఆదాయంగా చూస్తారు. 2023-2024 సంవత్సరానికి ఇన్ కమ్ ట్యాక్స్ ఆలస్యంగా దాఖలు చేయడానికి లాస్ట్ డేట్ జూలై 31,2024. ట్యాక్స్ పేయర్స్ ఈ సమయానికి వారి పర్సనల్ లేదా కార్పొరేట్ ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్‌లను అంచనా వేసి దాఖలు చేసి ఉండాలి.
అప్పుడు చెల్లించని వారు ఆలస్యంగా పన్ను రిటర్న్ చేయడానికి డిసెంబర్ 31చివరి తేదీ. ఎట్టి పరిస్థితులలో అయినా ఈ తేదీలోపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయాలి. లేకపోతే పన్ను దాఖలు చేసిన వారికి 10 వేల రూపాయలకు పైగా జరిమానా విధిస్తారు. మీ ఆదాయం 5 లక్షల రూపాయలు దాటితే పన్ను చెల్లించకపోతే ఈ జరిమానా విధిస్తారు. అలాగే, పన్ను చెల్లింపును ఆలస్యంగా చేసినా కూడా 5 లక్షల వరకు జరిమానా విధిస్తారు.
ఆలస్యమైన ఆదాయపు పన్నును ఫైల్ చేయడానికి.. ముందుగా ఆదాయపు పన్ను శాఖ పన్ను ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్‌కి వెళ్లాలి. మీ పాన్ నంబర్‌తో లాగిన్ అయ్యి..
ఐటీఆర్ ఫారమ్‌పై క్లిక్ చేయాలి. తగిన ఫారమ్‌ను ఎంచుకుని, ఆదాయ సమాచారాన్ని అందించాలి. ఏ సంవత్సరానికి ట్యాక్స్ కడుతున్నారో అది ఎంచుకుని…
ఆదాయం, ఖర్చులు, బాధ్యతలతో సహా సమాచారాన్ని అందించాలి.
తర్వాత ఆదాయపు పన్ను చెల్లించాలి. అయిేత బకాయి ఉన్న ఆదాయపు పన్నుపై పెనాల్టీ, వడ్డీ కూడా విధించబడుతుంది. తర్వాత రిటర్న్‌ని సమర్పించుపై క్లిక్ చేయండి. ఆధార్ ఓటీపీ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. అలాగే, ఆన్‌లైన్‌లో ట్యాక్స్ పే చేస్తున్నప్పుడు నెట్ బ్యాంకింగ్ ఓటీపీ ద్వారా ధృవీకరణ జరుగుతుంది.