ప్రస్తుతం వాణిజ్యం వేగంగా అభివృద్ధి చెందుతున్నా కూడా చాలా మంది ఇప్పటికీ దుకాణానికి వెళ్లి వస్తువులను కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. కిరాణా నుంచి బట్టలు, ఇతర వస్తువులను బయటే కొనడానికి కొంత మంది ఇష్టపడతారు. ఆన్ లైన్లో వస్తువులు ఇంటికి చేరేసరికి వేరేగా ఉంటాయని..అదే మనమే డైరక్టుగా వెళ్లి షాపింగ్ చేసుకుంటే ఆ అనుభూతే వేరని చెబుతారు.
అయితే షాపింగ్ అయితే ఒక ఎత్తు అయితే షాపింగ్ అయ్యాక చేసే బిల్లింగ్ కోసం లైన్లో నిలబడటమే పెద్ద తలనొప్పి అని చాలామంది ఫీలవుతారు. చాలా సార్లు బిల్లింగ్ కోసం క్యూలో నిలబడి చాలా సమయం వేస్ట్ చేసుకోవడం ఇష్టం లేకే తప్పనసరి పరిస్థితుల్లో ఆన్లైన్ వైపు మొగ్గు చూపిస్తున్నారు.అయితే ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేలా ముఖేష్ అంబానీ కంపెనీ ఓ పరిష్కారం తెచ్చింది.
ఈ క్యూ లైన్ నుంచి బయటపడటానికి స్మార్ట్ షాపింగ్ కార్ట్‌ను తీసుకొచ్చిన ముఖేష్ అంబానీ కంపెనీ జియో ..ఈ కార్ట్‌ను ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2024లో విడుదల చేసింది. దీనిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించారు. దీనిలో కెమెరాలను కూడా అమర్చారు. దీంతో కస్టమర్ లైన్‌లో నిలబడాల్సిన అవసరం ఉండదు. బిల్లింగ్ కోసం కౌంటర్‌కి వెళ్లాల్సిన పని అసలే ఉండదు.
తమకు అవసరమైన బట్టలు, వస్తువులు అన్నీ ఒక కార్టులో వేసుకుంటారు. అలా వేసిన వస్తువులను ఆ కార్ట్ వెనుక అమర్చిన కెమెరా ముందు వస్తువులపై బార్ కోడ్‌ను చూపించాలి. అంటే దానిని స్కాన్ చేయాల్సి ఉంటుంది. అంటే కౌంటర్ దగ్గర నిలబడిన వ్యక్తి స్కాన్ చేస్తున్నట్లే మనం కెమెరాకు చూపించగానే..స్కాన్ చేసిన తర్వాత ఆ వస్తువు ఆన్‌లైన్ కార్ట్‌కి జోడించబడుతుంది. తర్వాత అవన్నీ మన కార్టులో లేదా బ్యాగులో వేసుకోవచ్చు. షాపింగ్ పూర్తయిన తర్వాత పూర్తి బిల్లు ఈ కార్ట్ స్క్రీన్‌పై క్యూ ఆర్ కోడ్ తో సహా కనిపిస్తుంది. వెంటనే ఆన్‌లైన్‌లోనే పే చేయచ్చు. దీంతో టైమ్ చాలా ఆదా అవుతుంది.
ఇలాంటి సేవలు ఇప్పుడిప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం వల్ల కొన్ని నగరాల్లో మాత్రమే ఉపయోగిస్తున్నారు. రిలయన్స్ రిటైల్ ప్రస్తుతం హైదరాబాద్, ముంబైలోని కొన్ని స్టోర్లలో మాత్రమే దీనిని ఉపయోగిస్తున్నారు. త్వరలో దేశంలోని ఇతర స్టోర్లకు కూడా తీసుకురానున్నట్లు ముఖేష్ కంపెనీ తెలిపింది.