పసిడి ప్రియులకు ముఖ్యంగా మహిళలకు కనకం శుభవార్త వినిపిస్తోంది.వరుసగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు కూడా తగ్గాయి. కొద్ది రోజులుగా బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. వెండి ధరలు కూడా బాగా తగ్గుతున్నాయి. బంగారం, వెండి కొనేవారికి ఇది మంచి అవకాశమని చెప్పొచ్చని మార్కెట్ నిపుణులు అంటున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర దిగి రావడం వల్ల.. ఆ ప్రభావం విదేశీ మార్కెట్లపైన కూడా పడిందని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఆ ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాలపై కూడా కనిపించినట్లు నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్, వైజాగ్ వంటి ప్రాంతాల్లో బంగారం ధరలు వారం రోజుల్లో చూసినట్లయితే..భారీగా తగ్గినట్లే కనిపిస్తున్నాయి. ఇది బంగారం, వెండి కొనేవారికి, గోల్డ్ ఇన్వెస్టర్లకు సానుకూల అంశమని చెప్పొచ్చు.
వారం రోజుల నుంచి బంగారం ధరలను పరిశీలించినట్లయితే నవంబర్ 8న 79, 470 రూపాయల వద్ద ఉంది. అయితే తర్వాత బంగారం ధర పడిపోతూ వస్తోంది. నవంబర్ 15న బంగారం ధర ఏకంగా 75,760 రూపాయలుగా ఉంది. అంటే బంగారం ధర ఏకంగా 3,700 రూపాయల వరకు తగ్గింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారంకు ఈ ధర వర్తించగా.. 22 క్యారెట్ల బంగారం ధరలను చూసినట్లయితే..ఈ బంగారం ధర కూడా బాగానే పడిపోయింది. బంగారం ధర నవంబర్ 8న 72, 850 రూపాయలుగా ఉంది. అయితే తాజాగా ఈ ధర నవంబర్ 15న 69, 450 రూపాయలకి దిగడంతో..బంగారం ధర 3,400 రూపాయల వరకు పడిపోయింది.
అలాగే వెండి ధర కూడా తగ్గుతూ వస్తోంది. నవంబర్ 9న కేజీ వెండి ధర 1,03,000 రూపాయల వద్ద ఉంది. అయితే ఈ ధర ఇప్పుడు నవంబర్ 15వ తేదీకి వచ్చేసరికి 99 వేల రూపాయలకు పడిపోయింది. అంటే వెండి ధర ఏకంగా 4వేలకు దిగివచ్చినట్లయింది. అయితే బంగారం ధరలలో వస్తు సేవల పన్ను జీఎస్జీ అదనంగా ఉండటంతో పాటు..మేకింగ్ ఛార్జీలు కూడా అదనంగా ఉంటాయి.