దీపావళికి ముందే పెరిగిన బంగారం ధరలు..

Gold Prices Are Rising Heavily Before Diwali, Gold Prices, Gold Prices Are Rising Heavily, Gold Prices Are Increasing, Increasing Gold Prices, Demand For Gold, Gold Rates Hikes, Hallmark, Quality Certification, Latest Gold News, Gold Price, India, National News, Live Updates, Breaking News, Live News, Mango News, Mango News Telugu

దీపావళి పండుగకు ముందే బంగారం ప్రియులకు షాక్ తగిలింది. బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్ కు డిమాండ్ పెరుగుతున్నందువల్ల, దేశీయంగా కూడా ధరలు దూసుకెళ్తున్నాయి. నిన్న, స్వచ్ఛమైన బంగారం ధర ఢిల్లీలో రూ. 79,900గా నమోదైంది, ఇది రికార్డు స్థాయికి చేరువైంది. నిన్నటితో పోలిస్తే, 10 గ్రాముల బంగారంపై ధర రూ. 550 పెరిగింది.

మరోవైపు, ఫ్యూచర్ మార్కెట్లోనూ బంగారం జోరు కొనసాగింది. డిసెంబర్ నెల డెలివరీకి గాను 10 గ్రాముల ధర రూ. 77,620 వద్ద నమోదైంది. మల్టీ కమోడిటీ ఎక్స్‌చేంజ్‌లో గోల్డ్ ఫ్యూచర్ ధర రికార్డు స్థాయిలో రూ. 77,667 పలికింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వర్ణం ధరపై రూ. 870 పెరిగి రూ. 78,980కు చేరుకుంది. అంతకుముందు ఇది రూ. 78,100గా ఉంది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 800 పెరిగి రూ. 72,400కు ఎగబాకింది.  ప్రస్తుతం పుత్తడి ధర 10 గ్రాములు 79 వేలకు చేరుకుంది. దీపావళి పెళ్లిళ్ల సీజన్ మొదలైంది గనుక సమీప భవిష్యత్తులో ధరలు పెరిగే అవకాశమే ఉంది. కానీ.. 80 వేల దగ్గర ఆగే ఛాన్సయితే కనిపిస్తోందట.

అంతేకాక, వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. పారిశ్రామిక వర్గాలు మరియు నాణేల తయారీదారుల నుంచి పెరుగుతున్న డిమాండ్ కారణంగా, కిలో వెండిపై ధర రూ. 94,500కు చేరుకుంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 2,000 పెరిగి రూ. 1,05,000కు చేరింది.

అక్టోబర్ మొదటి వారంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆప్‌ ఇండియా (ఆర్బీఐ) పాలసీలో వడ్డీ రేట్లు తగ్గిస్తారని అందరూ అనుకున్నారు. కానీ.. అదేమీ జరగలేదు. అందుకే.. గోల్డ్ మీదే ఇన్వెస్ట్‌మెంట్ బెటరని అందరూ భావించడంతో.. డిమాండ్ పెరిగింది. ధరా పెరిగింది. నవంబర్‌లో యూఎస్ ఫెడరల్ పాలసీ రివిజన్ ఉంది. దాని ప్రభావం కూడా బంగారం ధరలపై ఉండబోతోంది. సో.. ధర ఎంత పెరుగుతుంది.. అనేది కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతానికి కొనుగోళ్లకు మంచి సమయమనేది నిపుణులిస్తున్న సలహా. బంగారం ధర ఇలా ఉంటే వెండి కూడా పరుగులు పెడుతోంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.97,000 ఉంది.