కొద్ది రోజులుగా బంగారం ధరలు విశ్లేషకుల అంచనాలకు సైతం అందడం లేదు. తగ్గుతుందని అంచనా వేస్తే భారీగా పెరుగుతుంది. పెరుగుతుందని అంచనా వేస్తే అమాంతం పడిపోతుంది. దీంతో బంగారం కొనడానికి మంచి సమయం ఇదేనా.. లేక ఇంకా వెయిట్ చేస్తే తగ్గుతుందా లేక పెరుగుతుందా అన్న అనుమానంలో పసిడిప్రియులు ఉన్నారు.
దీంతో ఏ రోజు బంగారం ధర ఎలా ఉందో అన్న ఆసక్తి అందరిలో పెరిగిపోతోంది. ఫెడ్ వడ్డీ రేట్ల కోత, అంతర్జాతీయ అనిశ్చితి వంటి అంశాలన్నీ బంగారం , వెండి ధరల హెచ్చుతగ్గులకు కారణం అవుతున్నట్లు ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు.
అలాగే నవంబర్ 29, శుక్రవారం హైదరాబాద్లో 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 70,920గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 77,340గా కొనసాగుతోంది. ఇటు కేజీ వెండి ధర రూ. 98,100గా ఉంది.
వరంగల్లో గోల్డ్ ధరలు చూస్తే.. 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ. 70,920- రూ. 77,340గా ఉన్నాయి. 100 గ్రాముల సిల్వర్ రేటు రూ. 9,810గాను.. కేజీ సిల్వర్ రేటు రూ. 98,100గా కొనసాగుతున్నాయి.
విజయవాడలో 22క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.70,920గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ ప్రైజ్ రూ. 77,340గా ఉంది.అలాగే కేజీ వెండి ధర రూ. 98,100గా ఉంది. విశాఖపట్నంలో కూడా ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 70,920గాను, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 77,340గాను ఉంది. 100 గ్రాముల వెండి రేటు రూ. 9,810 ఉంది.