
కరోనాకు చెక్ పెట్టడానికి భారత్ బయోటెక్ కంపెనీకి చెందిన కోవాగ్జిన్ టీకా తీసుకున్నవాళ్లలో మూడో వంతు వ్యక్తులు.. తొలి ఏడాదిలోనే తీవ్ర ఆరోగ్య సమస్యలతో ఇబ్బందిపడినట్లు గుర్తించామని బనారస్ హిందూ యూనివర్సిటీ తన అధ్యయనంలో తెలిపింది. బీహెచ్‌యూ పరిశోధకుల బృందం 926 మందిపై స్టడీ చేసి ఈ నిర్ణయానికి వచ్చినట్లు పేర్కొంది.
దీంట్లో 50 శాతం మంది టీకా తీసుకున్న తర్వాత తమకు ఇన్‌ఫెక్షన్స్ వచ్చినట్లు ఫిర్యాదు చేశారు. ఎక్కువ శాతం మంది ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ సోకినట్లు గుర్తించినట్లు చెప్పారు. ఒక్క శాతం వ్యక్తుల్లో మాత్రం చాలా తీవ్రమైన ఏఈఎస్ఐతో పాటు గులియన్ బారీ సిండ్రోమ్ వంటి లక్షణాలు కనిపించాయి. ఈ మేరకు స్ప్రింగర్ నేచర్ అనే జర్నల్.. బీహెచ్‌యూ నివేదికను ప్రచురించింది.
ఇప్పటికే ఆస్ట్రాజెనికాకు చెందిన కోవీషీల్డ్ టీకా తీసుకున్నవారిలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నట్లు ఇటీవల రిపోర్టులు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో కోవాగ్జిన్ టీకా గురించి కూడా ఒక రిపోర్టును తయారు చేసింది బీహెచ్‌యూ. కోవాగ్జిన్ తీసుకున్న వారిలో మూడో వంతు అంటే.. 30 శాతం మంది టీకా తీసుకున్న ఏడాది తర్వాత ఆరోగ్య సమస్యలతో సతమతమయినట్లు బీహెచ్‌యూ తన అధ్యయనంలో చెప్పింది.
వీరిలో 4.6 శాతం మంది స్త్రీలు..తమ రుతుక్రమం సమయంలో అసాధారణ పరిస్థితి ఏర్పడటాన్ని అధ్యయనం హైలెట్ చేసింది. అలాగే 2.7 నుంచి 0.6 శాతం మందిలో కంటి సంబంధిత సమస్యలతో పాటు హైపోథైరాయిడిజం సమస్యను కూడా గుర్తించారు. టీకా తీసుకన్న వారిలో ముగ్గురు స్త్రీలు, ఒక పురుషుడు చనిపోయినట్లుగా కూడా బీహెచ్‌యూ గమనించింది. టీకా తీసుకున్న ఏడాది తర్వాత నలుగురికి కొత్తగా మధుమేహం వచ్చింది. ఇలా చాలామందది ఒక్కో సమస్యతో బాధపడుతున్నట్లు అధ్యయనకర్తలకు వివరించారు.
అంతేకాకుండా కోవాగ్జిన్ టీకా తీసుకున్నవారిలో 35 ఏళ్ల లోపు వారిలో చర్మ, సాధారణ, నరాల సంబంధిత వ్యాధులు వచ్చినట్లు తెలుస్తోందని స్టడీలో తేల్చారు. జనవరి 2022 నుంచి ఆగస్టు 2023 వరకు స్టడీ చేపట్టిన బీహెచ్‌యూ…టీకా తీసుకున్న 635 మంది యుక్త వయస్కులు, 291 మంది నడి వయస్కులపై ఈ అధ్యయనాన్ని చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY