2025లో ఫిబ్రవరి స్పెషాలిటీపై వస్తున్న వార్తల్లో నిజమెంత?

How Much Of The News About The February Specialty In 2025 Is True, The February Specialty In 2025 Is True, February Specialty In 2025, 2025 February Specialty, 2025 February Specialty News, February 2025, February Specialty, News About The February Specialty In 2025, Specialty In 2025, Live Updates, Breaking News, Headlines, Live News, Mango News, Mango News Telugu

ఈ ఏడాదిలో రాబోయే ఫిబ్రవరి అరుదైన ఫిబ్రవరి నెలగా చరిత్రలో నిలిచిపోతుంది. ఇటువంటి ప్రత్యేకత గల ఫిబ్రవరి 823 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. రాబోయే ఫిబ్రవరిలో 4 ఆదివారాలు, 4 సోమవారాలు, 4 మంగళవారాలు, 4 బుధవారాలు, 4 గురువారాలు, 4 శుక్రవారాలు , 4 శనివారాలు వస్తున్నాయి.

సంవత్సరంలో రెండో నెల అయిన ఫిబ్రవరి నెలలో సాధారణంగా లీపు సంవత్సరాలలో 29 రోజులు ఉంటాయి. సాధారణ సంవత్సరాల్లో అయితే ఫిబ్రవరి నెలకు 28 రోజులు మాత్రమే ఉంటాయి. ఏడాదిలో అతి చిన్న నెల అయిన ఫిబ్రవరి విషయంలో ఎప్పుడూ కూడా ఎన్నో చర్చలు జరుగుతూ ఉంటాయి. ఈ ఏడాది లీపు సంవత్సరం కాకపోవడంతో..ఈ ఏడాది మొత్తం 28 రోజులు ఉన్నాయి.

ఈ 2025 ఫిబ్రవరిలో వారంలో ఏడు రోజులూ కూడా ఒక్కోటి నాలుగేసిసార్లు రానున్నాయి. 823 ఏళ్లకోసారి మాత్రమే ఇలా వస్తుందని కొంత మంది చెబుతున్నారు. ప్రతి 176 సంవత్సరాలకోసారి ఫిబ్రవరిలో సోమ, శుక్ర, శనివారాలు మూడేసి రోజులు మాత్రమే వస్తాయని మరి కొంతమంది చెప్పారు. దీంతో సోషల్ మీడియాలో దీనిపై రకరకాల కామెంట్లు వస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి మనందరికీ అత్యంత స్పెషల్ అని కామెంట్లు చేస్తున్నారు.

అయితే సోషల్ మీడియాలో ఇలా వైరల్ అవుతున్న ఫిబ్రవరి నెల గురించి వస్తున్న వాదనలో ఎలాంటి వాస్తవం లేదని గణిత శాస్త్రవేత్తలు అంటున్నారు. గతంలో కూడా ఫిబ్రవరి నెలలో నాలుగు ఆదివారాలు, నాలుగు సోమవారాలు వచ్చాయి. 2025 సంవత్సరం ఫిబ్రవరి క్యాలెండర్ ను పరిశీలిస్తే.. ఫిబ్రవరిలో ప్రతి వారం నాలుగు సార్లు వచ్చింది. లీపు సంవత్సరం తప్ప ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో 28 రోజులు, వారానికి ఏడు రోజులు తప్పనిసరిగా ఉంటాయి. కాబట్టి ప్రతి వారం నాలుగు సార్లు తప్పకుండా వస్తాయి. లీపు సంవత్సరంలో మాత్రం ఫిబ్రవరి నెలలో 29 రోజులు ఉండటంతో.. నెలలో ఒకటి లేదా మరొక రోజు ఐదు సార్లు వస్తుంది. మిగిలిన వారాలన్నీ నాలుగు సార్లు వస్తాయి.

2021, 2023 సంవత్సరాలలో ఫిబ్రవరి నెల క్యాలెండర్ ను పరిశీలించినా కూడా.. అందులో కూడా ప్రతి వారం నాలుగేసి సార్లే వచ్చింది. 823 సంవత్సరాలకు కాదు ఒక్క లీపు సంవత్సరం తప్ప ఫిబ్రవరిలో ప్రతి రోజు నాలుగు సార్లు వస్తుందని గణిత శాస్త్రవేత్తలు తెలిపారు. ఇదేమీ అత్యంత అరుదైన విషయం కాదని కొట్టి పడేస్తున్నారు. కాబట్టి వైరల్ అవుతున్న పోస్టుల్లో నిజం లేదని చెప్పారు. 2021లో కూడా ఇదే వాదనతో పోస్టులు వైరల్ అయ్యాయంటూ గుర్తు చేస్తున్నారు.