చలికాలం కావడంతో చాలా చోట్ల చలి తీవ్రత పెరిగిపోయింది. వీటితో పాటు మంచు కూడా ఎక్కువగా ఉంటోంది. ఈ పొగ మంచు వల్లే ఈ కాలంలో ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతాయి. ఫాగ్ వల్ల డ్రైవ్ చేసేవాళ్లు చాలా ఇబ్బంది పడతారు. దీనికి తోడు ఈ కాలంలో వాహనాలకు విండ్ షీల్డ్‌పై ఫాగ్ ఎక్కువగా నిండివడం వల్ల ఇంకా ప్రమాదాలు పెరిగిపోతుంటాయి.అయితే దీన్ని క్లియర్ చేయాలంటే చిన్న టిప్స్ పాటించాలని నిపుణులు అంటున్నారు.
కారులో వెళ్లేటపుడు విండ్ స్క్రీన్‌పై పొగమంచు ఎక్కువగా ఏర్పడకుండా ఉండాలంటే.. కారులో ప్రయాణించేటప్పుడు లోపల హీటర్‌ను ఎక్కువ సమయం ఆన్‌లో ఉంచకూడదు. ఇలా ఉంచి డ్రైవ్ చేయడం వల్ల ఎక్కువగా ఫాగ్ ఏర్పడుతుంది. అంతేకాకుండా కారు లోపల ఉష్ణోగ్రత తక్కువగా ఉండటం వల్ల తేమ ఏర్పడుతుంది. దీంతో కారు విండ్ స్క్రీన్‌పై ఫాగ్ ఏర్పడుతుంది.
ఈ ఫాగ్ వల్ల ముందు వాహనాలు, మనుషులు క్లియర్ గా కనిపించరు. దీంతోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతుంటాయి. అయితే ఇలాంటి సమయాల్లో అద్దాలపై నిండిన ఫాగ్ నుంచి విముక్తి చెందడానికి వెంటనే ఆన్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల కారు విండ్ స్క్రీన్‌పై పొగమంచు పెరగకుండా ఉంటుంది. ఇలా ఏసీ ఆన్ చేయడం వల్ల బయట టెంపరేచర్‌కు లోపల ఏసీ ఉష్ణోగ్రత సరిగ్గా సరిపోయి ఫాగ్ సమస్య తగ్గుతుంది.
చలికాలంలో ప్రయాణాలు చేసేవారు ఎప్పుడూ కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. చలికాలంలో పొగమంచు వల్ల ఘోర ప్రమాదాలు జరుగుతాయి. దీనికి తోడు మంచులో ప్రయాణిస్తే చేస్తే పొగమంచు పెరిగి రోడ్డు కనిపించక ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి ఈ కాలంలో వీలయినంత వరకూ ఎర్లీ మార్నింగ్ ప్రయాణాలు పెట్టుకోకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.