గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక భద్రతను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన గ్రామ సురక్ష పథకానికి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ పథకం ద్వారా భవిష్యత్తులో ఆర్థిక స్థిరత్వాన్ని అందించడమే లక్ష్యం. ఇప్పుడు ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు, అర్హతలు, ప్రీమియం వివరాలను తెలుసుకుందాం.
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
ఈ పథకానికి 19 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు అర్హులు.
పాలసీదారు తన సౌలభ్యానికి అనుగుణంగా 10, 15, 20 సంవత్సరాల పాలసీ వ్యవధిని ఎంచుకోవచ్చు.
దరఖాస్తు ప్రక్రియ చాలా సులభం – పోస్టాఫీస్‌లో అప్లికేషన్ ఫారం నింపి అవసరమైన పత్రాలతో సమర్పించాలి.
ప్రీమియం ఎంత చెల్లించాలి?
దరఖాస్తుదారులు తమ ఆర్థిక సామర్థ్యాన్ని అనుసరించి నెలకు, మూడు నెలలకు లేదా సంవత్సరానికి ఒకసారి ప్రీమియం చెల్లించవచ్చు.
కనీసం రోజుకు ₹50 అంటే నెలకు ₹1500 మాత్రమే పెట్టుబడిగా చెల్లించాల్సి ఉంటుంది.
దీని ద్వారా నిర్ణీత కాలంలో ₹35 లక్షల వరకు లాభం పొందే అవకాశం ఉంది.
రూ.35 లక్షలు ఎలా అందుకుంటారు?
రోజుకు ₹50 చెల్లిస్తే, నెలకు ₹1500, సంవత్సరానికి ₹18,000 డిపాజిట్ అవుతుంది.
19 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్సున్న వ్యక్తి పాలసీలో కొనసాగితే, మొత్తం పెట్టుబడి ₹6.48 లక్షలు అవుతుంది.
మెచ్యూరిటీ గడువు ముగిసే సరికి ఇది ₹30 – ₹35 లక్షల వరకు పెరుగుతుంది.
పథకంలోని ముఖ్య విశేషాలు:
✔ 19 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్సు గల భారతీయులు ఈ స్కీమ్‌లో చేరవచ్చు.
✔ రోజుకు ₹50 పెట్టుబడి పెడితే, ₹35 లక్షల వరకు మెచ్యూరిటీ లాభం పొందొచ్చు.
✔ పాలసీదారి మరణించినా, నామినీలకు మొత్తం బీమా మొత్తం అందుతుంది.
✔ 5 సంవత్సరాల అనంతరం, ఈ పథకాన్ని ఎండోమెంట్ హామీ ప్లాన్‌గా మార్చుకోవచ్చు.
✔ 19-58 ఏళ్లలో పెట్టుబడి పెడితే ₹33.40 లక్షలు, 60 ఏళ్ల వరకైతే ₹34.60 లక్షలు రాబడి పొందవచ్చు.
✔ బోనస్ ప్రయోజనం కూడా ఉంది – ప్రతి ₹1000 డిపాజిట్‌పై సంవత్సరానికి ₹60 బోనస్ వస్తుంది.
✔ ఈ పథకాన్ని ప్రారంభించిన మూడు సంవత్సరాల తర్వాత, పాలసీదారుడు స్వచ్ఛందంగా రద్దు చేసుకోవచ్చు.
మీ భవిష్యత్తును భద్రపరచుకోవడానికి గ్రామ సురక్ష పథకాన్ని ఉపయోగించుకోండి. మరింత సమాచారం కోసం మీ సమీప పోస్టాఫీస్‌ను సంప్రదించండి!