మన దేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు చాలా కీలకమైన డాక్యుమెంట్. పాన్ కార్డు, బ్యాంక్ ఖాతాలు, ప్రభుత్వ పథకాలతో సహా అన్ని అవసరాలకు ఆధార్ తప్పనిసరి. అంతేకాకుండా, ఆధార్ పొందిన ప్రతి ఒక్కరూ 10 ఏళ్లకు ఒక్కసారి తమ పేరు, చిరునామా, పుట్టిన తేదీ వంటి వివరాలు సెంట్రల్ ఐడెంటిటీస్ డేటా రిపాజిటరీ (CIDR)లో అప్‌డేట్ చేయాలని నిబంధన ఉంది.
UIDAI సంస్థ ఆధార్ అప్‌డేట్ ప్రక్రియను myAadhaar పోర్టల్ ద్వారా ఉచితంగా అందిస్తోంది. అయితే, ఈ ఉచిత సదుపాయం డిసెంబర్ 14, 2024తో ముగియనుంది. ఆ తర్వాత ఆధార్ అప్‌డేట్ చేయాలంటే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ సేవలను వినియోగించుకోవడానికి మిగిలి ఉన్న 10 రోజులు మీకు విలువైనవిగా మారొచ్చు!
ఉచిత ఆధార్ అప్‌డేట్ ఇలా చేయండి:
https://myaadhaar.uidai.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి లాగిన్ చేయండి.
Online Update Services పై క్లిక్ చేసి Update Aadhaar Online Election పై క్లిక్ చేయండి.
పేరు, జెండర్, పుట్టిన తేదీ లేదా చిరునామా వంటి వివరాలను అప్‌డేట్ చేయండి.
అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన రిక్వెస్ట్ నంబర్‌ను సేవ్ చేసుకోండి.
అలాగే, ఆధార్ కార్డును బ్యాంక్ ఖాతాతో లింక్ చేయాలని ప్రభుత్వం సూచిస్తోంది. అప్‌డేట్ చేసిన ఆధార్ లు మాత్రమే ప్రభుత్వ పథకాలకు అనర్హత నుంచి రక్షణ కల్పిస్తాయి. కనుక మీరు వీలైనంత త్వరగా ఆధార్ వివరాలు సరిచేసుకోండి.