మన పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వల్ల వారి తర్వాతి తరం వారు కష్టాలు పాలవడం, పాపాలు మూటకట్టుకోవడం జరుగుతుందని..పెద్దలు, పండితులు చెబుతూ ఉంటారు. ఈ పితృ దోషాల వల్లే చాలామంది తమతమ జీవితంలో కష్టాలు ఎదుర్కొంటారని అంటారు. కష్టాలు ఎదురైనప్పుడు వారి జాతకంలో ఇటువంటి దోషాలు ఉంటే వాటిని సులభంగా గుర్తించవచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
ఒక వ్యక్తి జీవితంలో దోషాలు ఉన్నప్పుడే రకరకాలయిన సమస్యలను ఎదుర్కొంటారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదాహరణకు పనుల్లో అవాంతరాలు,పనులు అసంపూర్తిగా ఉండటం వంటివి కనిపిండచడంతో పాటు.. ఇంటా బయట గౌరవ మర్యాదలను కోల్పోవడం, అతి చిన్నవయస్సులోనే వైవిద్యం ఏర్పడడటం వంటివి జరుగుతాయి. అంతేకాదు కుటుంబంలో కలహాలు, మానసిక ఆందోళనలు ఎదుర్కొంటారు. పిల్లల వల్ల సమస్యలు, పిల్లలు పుట్టకపోవడం వంటి సవాళ్లను వాళ్లు ఎదుర్కొంటారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
అందుకే ప్రతి కుటుంబంలో వారి తమ జీవితంలో రుణాలను తీర్చుకోవాలి. అప్పుడే చనిపోయిన మన పెద్దల నుంచి పూర్తి ఆశీస్సులు పొందుతారుని ముక్తి, మోక్షం లభిస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటారు. పితృ రుణం తీర్చుకోకపోతే వారికి దోషాల నుంచి విముక్తి లభించదని నిపుణులు చెప్తున్నారు. ఇలాంటి వాటి ఆరాధనకు అనుకూలమైన రోజు మహాలయ అమావాస్యగా పండితులు సూచిస్తున్నారు. మహాలయ అమాస్య రోజు కొన్ని పనులు చేయడం వల్ల వారి దోషాలు తొలగిపోవడంతో పాటు అదృష్టం పొందుతారు.
ఈ మహాలయ అమావాస్య రోజున పూర్వీకులను స్మరించుకోవడంతో పాటు ఆరోజు.. పవిత్ర గంగా స్నానాలు, నదీ స్నానాలు చేసి మన పూర్వీకుల శాంతి కోసం పూజలు చేస్తే వారి ఆశీర్వాదం పొందుతారు. అలాగే నదుల్లో తర్పణాలను వదలడం వల్ల కూడా పితృ దోషాలు తొలగిపోతాయి.కాకులకు, కుక్కలకు, చీమలకు ఆహారాన్ని అందించడం వల్ల.. చనిపోయిన మన పూర్వీకుల అనుగ్రహం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
కుటుంబ సభ్యులలో చనిపోయిన వారికి మహాలయ అమావాస్య రోజు వారి పేరు మీద అన్నదానం, దాన ధర్మాలు చేస్తే మంచిదని చెబుతున్నారు. దీంతోపాటు వీలయితే బ్రాహ్మణులకు భోజనం పెట్టడం చాలా మంచిదట. వీరికి వడ్డించే ఆహారం నేరుగా చనిపోయిన పూర్వీకులకు అందుతుందని పండుతులు చెబుతారు. మహాలయ అమావాస్య రోజును.. సర్వ పితృ అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ రోజు చనిపోయిన వారికోసమే కేటాయిస్తారు. ఈ రోజు చేసే పూజలను స్వీకరించిన పూర్వీకులు.. వారి కుటుంబంలోని వారిపై ఆశీస్సులు కురిపిస్తారనే నమ్మకం ఉంది.