డిసెంబరులో సాధారణంగా ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 24- 26 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే తక్కువగా నమోదవుతూ ఉంటుంది. కానీ ఈసారి డిసెంబర్ మొదటి వారంలో ఉష్ణోగ్రత 26-27 డిగ్రీల వరకు ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే డిసెంబరు నెల ప్రారంభమైనా.. ఢిల్లీలో చలి కనిపించడం లేదు.
ఢిల్లీలో మధ్యాహ్నం సమయాల్లో చాలా వేడిగా ఉంటుంది. డిసెంబరు మొదలైంది కానీ ఢిల్లీ,ఎన్‌సీఆర్‌లో చలికి వణికిపోయే సూచనలు కనిపించడం లేదు. సాధారణంగా డిసెంబర్ ప్రారంభంతోనే ఢిల్లీలో తీవ్రమైన చలి మొదలవుతుంది. కానీ ఇప్పుడు భిన్నమైన వాతావరణం కనిపించనుంది. నిజం చెప్పాలంటే చలి తీవ్రత కోసం ఢిల్లీ వాసులు ఎదురు చూస్తున్నారు.
ఇక్కడ ఉదయం, సాయంత్రం సమయాల్లో మాత్రమే కాస్త చలికాలంలా అనిపిస్తుందని.. మధ్యాహ్న సమయంలో ఎండలు ఎక్కువగా ఉండడంతో వేడిగా ఉంటుందని ఢిల్లీ ప్రజలు చెబుతున్నారు. డిసెంబరులో ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 24 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే తక్కువగా నమోదవుతాది. కానీ ఈసారి డిసెంబర్ మొదటి వారంలో ఉష్ణోగ్రత 26-27 డిగ్రీల వరకు ఉండొచ్చని వాతావరణ శాఖ చెబుతోంది.
2011 తర్వాత నుంచి డిసెంబర్ మొదటి వారంలో ఢిల్లీలో ఇలాంటి వాతావరణం ఎప్పుడూ కనిపించలేదు. ఢిల్లీలో రుతుపవనాల కారణంగా ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో వాతావరణం పొడిగా ఉంది. అక్టోబర్, నవంబర్‌లో ఒక్కసారి కూడా వర్షాలు పడకపోవడం వల్ల.. ప్రస్తుతం వెస్ట్రన్ డిస్టర్బెన్స్ చాలా బలహీనంగా ఉంది. దీని వల్ల ఢిల్లీతో సహా ఉత్తర భారతదేశంలో తీవ్రమైన చలి కనిపించలేదు. బలహీనమైన పాశ్చాత్య డిస్ట్రబెన్స్ వల్ల..ఈసారి చలికాలం ఢిల్లీ,ఎన్ సీఆర్, ఉత్తర భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లో కొంచెం ఆలస్యంగా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
డిసెంబర్ 5 తర్వాత ఢిల్లీలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ సమయంలో రాజధానిలో కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీలు.. గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ ఉండొచ్చని చెప్పింది. డిసెంబర్ 6, 7 తేదీల్లో మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. డిసెంబర్ 12- 15 తర్వాత కూడా ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో చలికాలం మొదలవుతుందని చెబుతున్నారు.