హెల్త్ మీద అందరికీ అవేర్ నెస్ పెరుగుతున్న గతంలో వినని పేర్లను కూడా తరచూ వింటున్నాం. చియా సీడ్స్, సబ్జా గింజలు, అవిసెగింజలు, రకరకాల చిరుధాన్యాల పేర్లు ఇప్పుడు అందరి నోళ్లలో నానుతున్నాయి. అలా ఇప్పుడు పూల్ మఖానా పేరు కూడా తరచూ వినిపిస్తోంది. అయితే లోటస్ సీడ్స్ నే.. పూల్ మఖానా అంటారని చాలా మందికి తెలియదు. వీటిని వేయించి పాప్ కార్న్ లాగా తింటారు. ఈ లోటస్ విత్తనాలు పురుషుల సంతానోత్పత్తిని పెంచడంలో ముందుండటంతో పాటు..ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి.
లోటస్ గింజలను పోషకాల పవర్‌హౌస్‌గా పిలుస్తారు. మఖానాలో కొలెస్ట్రాల్, సోడియం తక్కువగా ఉండటంతో.. మూత్రపిండాల సమస్యలు, దీర్ఘకాలిక విరేచనాలు, అధిక ల్యుకోరోయా వంటి వివిధ వ్యాధుల చికిత్సకు వీటిని చాలా ఏళ్లుగా ఆయా వ్యాధులకు మందులుగా ఉపయోగిస్తున్నారు. మఖానాలో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండటంతో.. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా మఖానా ఆహారం తినాలన్న కోరికలను తగ్గిస్తుంది.దీనిని తరచూ తీసుకోవడం వల్ల ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది.
మఖానా పురుషులలో సంతానోత్పత్తిని పెంచుతాయి. అంతేకాకుండా ఈ విత్తనాలు వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తాయి. మఖానాలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల.. గుండె జబ్బులు, క్యాన్సర్, టైప్ 2 డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. ఇవి చిన్నారులలో,వృద్ధులలో ఎముకలను బలపరుస్తాయి. మఖానాలో కాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఇవి ఎముక, మృదులాస్థి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.మఖానా విత్తనాలు చర్మం ముడతలు, జుట్టు రాలడం, తగ్గించడంతో పాటు వృద్ధాప్య ప్రక్రియను కూడా నెమ్మదిస్తాయి.
నెయ్యిలో కానీ, నూనెలో కానీ లైట్ గా వేయించిన తామర గింజలు అద్భుతమైన, ఆరోగ్యకరమైన చిరుతిండిగా వాడుకోవచ్చు. దీని లోని తక్కువ కొవ్వు, అధిక ప్రోటీన్ కంటెంట్ ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునేవారికి ఇవి మేలు చేస్తాయి. మఖానాను నెయ్యిలో వేయించడం తినడం వల్ల వెన్నతో కూడిన రుచి వస్తుంది. నెయ్యి ఆరోగ్యకరమైన కొవ్వుల మూలం కాబట్టి అన్ని వయసువారికి ఇది మంచింది. A, D, E, K వంటి విటమిన్లు , అవసరమైన పోషకాలు కలిగి ఉండంతో.. మఖానాను నెయ్యిలో వేయించడం వల్ల దాని పోషక విలువలు మరింత పెరుగుతాయి.
తామర గింజలను నెయ్యిలో వేయించి తింటే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. ముఖ్యంగా సెన్సిటివ్ జీర్ణవ్యవస్థ ఉన్నవారికి ఇది చాలా మంచిది. పైగా ఆకలిని నియంత్రించడంతో ది బెస్ట్ గా ఉంటాయి. మఖానాలో కేలరీలు తక్కువగా ఉండి.. పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది.నెయ్యిలో వేయించిన పూల్ మఖానా తినటం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభించడం వల్ల ఇవి ఫ్రీ రాడికల్స్, ఆక్సీకరణ ఒత్తిడి నుంచి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE