బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) తన వినియోగదారుల కోసం కొత్త నిర్ణయాలతో ముందుకు దూసుకెళ్తోంది. తాజాగా కంపెనీ కొత్త లోగోతో పాటు ఏడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురావడం మాత్రమే కాకుండా, మరింత ఆకర్షణీయమైన సర్వీసులను ప్రారంభించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4G నెట్‌వర్క్ విస్తరణ కోసం బీఎస్‌ఎన్‌ఎల్ పెద్ద ఎత్తున టవర్లను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే 50,000 4G టవర్లను ఏర్పాటుచేసిన ఈ సంస్థ, ఈ సంవత్సరం చివరికి 75,000 టవర్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే, 2025 జూన్ నాటికి 5G నెట్‌వర్క్‌ను ప్రారంభిస్తామని టెలికాం మంత్రి ఇటీవల ప్రకటించారు.
తాజాగా బీఎస్‌ఎన్‌ఎల్ నేషనల్ వైఫై రోమింగ్ సర్వీసులను (National Wi-Fi Roaming Service) ప్రారంభించింది. దీని ద్వారా BSNL FTTH (ఫైబర్ టూ ది హోం) వినియోగదారులు దేశంలోని ఏ ప్రాంతంలోనైనా హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌ను వినియోగించుకోవచ్చు. ఈ సేవ ప్రస్తుతం కేవలం FTTH వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది, తద్వారా వారికి మరింత వేగవంతమైన ఇంటర్నెట్‌ను అందించేందుకు BSNL ఈ సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది.
BSNL FTTH యూజర్లు ఇప్పటివరకు తమ రూటర్ పరిధి మేరకు మాత్రమే ఇంటర్నెట్‌ను వినియోగించగలిగేవారు. కానీ, ఈ నేషనల్ వైఫై రోమింగ్ సర్వీస్ ప్రారంభంతో FTTH యూజర్లు ఎక్కడి నుంచైనా BSNL వైఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ అవ్వవచ్చు. ఇందుకోసం సంబంధిత వెబ్‌సైట్‌లో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది.
BSNL సిమ్ కార్డు వినియోగదారులకు ప్రస్తుతం ఈ రకమైన హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులో లేదు. కానీ FTTH యూజర్లు దేశంలో BSNL వైఫై అందుబాటులో ఉన్న ప్రతిచోటా హైస్పీడ్ ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా BSNL వైఫై సౌకర్యం ఉంటే, అక్కడ ఈ కొత్త సర్వీస్ ద్వారా ఇంటర్నెట్‌ను ఉపయోగించుకోవచ్చు.
BSNL FTTH వినియోగదారులు ఈ నేషనల్ వైఫై రోమింగ్ సర్వీసులను వినియోగించడానికి యాక్టివ్ FTTH కనెక్షన్ ఉండాలి. అదనంగా, BSNL వైఫై రోమింగ్ పోర్టల్ (http://portal.in/ftth/wifiroaming) లో రిజిస్టర్ కావాలి. రిజిస్ట్రేషన్ సమయంలో యాక్టివ్ FTTH కనెక్షన్ నంబర్ మరియు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నమోదు చేసి Captcha కోడ్ సహా OTP ధృవీకరణను పూర్తి చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత నేషనల్ వైఫై రోమింగ్ సర్వీసులు యాక్టివేట్ అవుతాయి.
ఇతర ప్రైవేటు టెలికాం ప్రొవైడర్లకు ఈ తరహా సేవలను అందించే అవకాశం లేదు. వంటి సంస్థలు తమ హైస్పీడ్ నెట్‌వర్క్ ద్వారా అత్యవసర సమయాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్‌ను వినియోగదారులకు అందించగలవు, కానీ నేషనల్ వైఫై రోమింగ్ ద్వారా BSNL వినియోగదారులు మరింత విస్తృతమైన సేవలను పొందే అవకాశం ఉంది.