ట్యాంక్ లో నీటిని చల్లగా ఉంచుకోవాలా? ఈ చిట్కాలు పాటించండి!

Want To Keep Water Cool In Summer Follow These Simple Tips

గ్రీష్మకాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఎండలు మండిపోతుండటంతో ప్రతిఒక్కరూ చల్లదనాన్ని కోరుకుంటున్నారు. ఇంట్లో, ఆఫీసుల్లో ఎయిర్ కండీషనర్లు, కూలర్లు వాడితే కొంత ఉపశమనం లభిస్తుంది. కానీ వాటర్ ట్యాంక్‌లో ఉన్న నీరు వేడెక్కిపోవడం సమస్యగా మారుతుంది. పగలు భరించలేని ఎండ వేడికి ట్యాంక్‌లోని నీరు మరీ అంత వేడిగా మారిపోతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు కొన్ని సులభమైన చిట్కాలను పాటిస్తే, వేసవిలో కూడా చల్లటి నీటిని పొందొచ్చు.

నీటి ట్యాంక్‌ను సూర్యకాంతికి గురికాకుండా చేయండివేసవిలో నీటి ట్యాంక్‌ను నేరుగా సూర్యరశ్మికి గురిచేయకుండా చూసుకోవాలి. వీలైతే నీడలో ఉంచడం మంచిది. ఇంటి పైకప్పుపై ఉన్న ట్యాంక్‌కు సరైన షేడ్ ఉండేలా జాగ్రత్త పడాలి.

ట్యాంక్‌ను కవర్ చేయడంఎండ బలంగా ఉంటే, ట్యాంక్ పైన టిన్ షెడ్ నిర్మించడం ప్రయోజనకరంగా ఉంటుంది. లేకపోతే, తెల్లటి వస్త్రం లేదా అల్యూమినియం ఫాయిల్‌తో కప్పితే సూర్యరశ్మిని నిరోధించవచ్చు. ఇదే విధంగా తడి గుడ్డలు లేదా జనపనార సంచి వేయడం వల్ల ట్యాంక్ వేడెక్కకుండా ఉండే అవకాశం ఉంది.

ట్యాంక్ రంగు మార్చడంనీటి ట్యాంక్ నలుపు లేదా ముదురు రంగులో ఉంటే, దానికి తెల్లటి లేదా లేత రంగు పెయింట్ చేయడం మంచిది. లేత రంగులు వేడిని తక్కువగా గ్రహిస్తాయి.

చుట్టూ తేమతో కూడిన పదార్థాలు ఉంచడంనీటి ట్యాంక్ బహిరంగ ప్రదేశంలో ఉంటే, దాని చుట్టూ తేమగా ఉండే మట్టి లేదా గడ్డి ఉంచడం వల్ల వేడిని తగ్గించుకోవచ్చు. ఇది సహజంగా నీటిని చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ చిన్న చిట్కాలను పాటించడం ద్వారా వేసవి వేడిమిలో కూడా చల్లని నీటిని పొందొచ్చు.