మీరు మొబైల్‌ను పట్టుకునే స్టైల్ ఏది? మీరెలాంటి వారో అదే చెప్పేస్తుందట

What Is Your Mobile Holding Style | Mango News Telugu

ఒకరి వ్యక్తిత్వం గురించి పూర్తిగా కాకపోయినా చాలావరకూ తెలుసుకోవడానికి, వారితో కొంత సమయం గడిపితే చాలని చాలామంది సైకాలజిస్టులు అంటుంటారు. అయితే ఇప్పుడు వారి కంటి చూపు, చేతి హావభావాలు, చిరునవ్వు, ఇతర అంశాలతో కూడా మనిషి వ్యక్తిత్వాన్ని చెప్పొచ్చునని కొత్త అధ్యయనాలు చెబుతున్నాయి. అలా మీరు మీ మొబైల్‌ను పట్టుకునే విధానం బట్టి కూడా మీ వ్యక్తిత్వాన్ని చెప్పేయొచ్చట.

మీరు మొబైల్ ఫోన్‌ను రెండు చేతులతో ఉపయోగించే వ్యక్తులు అయితే సమర్థవంతమైన, త్వరగా నిర్ణయం తీసుకోవడంలో మీరు ముందుంటారు. ఈ వ్యక్తులు ఏ పరిస్థితి వచ్చినా సరే దానికి అనుగుణంగా మారిపోతారు. అందువల్ల వీరు ప్రతీ రంగంలో కూడా విజయాలు సాధిస్తారు. కాకపోతే దృఢమైన వ్యక్తిత్వం వల్ల కొందరితో సన్నిహితంగా ఉండలేకపోతారట.

మీరు ఫోన్‌ని ఒక చేతిలో పట్టుకుని, స్క్రోల్ చేసే వ్యక్తులు అయితే మీరు అధిక విశ్వాసాన్ని కలిగి ఉంటారట. అందువల్ల, మీరు జీవితంలో రిస్క్ తీసుకోవడానికి భయపడరు. ఇలాంటివారు చాలా తెలివైనవారని విజయవంతమైన జీవితాన్ని గడపగలరని అధ్యయనాలు చెబుతున్నాయి. ఏ వ్యక్తినైనా అర్థం చేసుకోవడానికి వీరికి చాలా సమయం పడుతుంది.

అలాగే మీరు ఒక చేతిలో ఫోన్, మరో చేతి చూపుడు వేలితో స్క్రోల్ చేస్తున్న వ్యక్తులు అయితే..మీరు జీవితంలో సృజనాత్మక ఆలోచనలు కలిగి ఉంటారు. ఎక్కువగా ఏకాంతాన్ని ఇష్టపడే వ్యక్తులుగా ఉంటారు. మీకు సిగ్గు ఎక్కువ ఉండటంతో కొత్త వ్యక్తులతో సంబంధాలను పెట్టుకోలేరట.

మీరు ఒక చేతిలో ఫోన్‌ని పట్టుకుని, మరో చేతి బొటనవేలుతో స్క్రోల్ చేస్తున్న కోవలోకి చెందిన వారయితే.. మీరు తెలివైన, సహేతుకమైనవారుగా అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ వ్యక్తులు మొత్తం పరిస్థితిని విశ్లేషించి, దీనిద్వారా నిర్ణయాలు తీసుకుంటారు. ఈ వ్యక్తులు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల మోసపోయే అవకాశం తక్కువగా ఉంటుంది. ఈ వ్యక్తుల జీవితంలో ప్రేమ ప్రధాన లోపంగా ఉంటుంది. భాగస్వామితో వాగ్వవాదాలకు ఎక్కువగా గురికావడంతో.. త్వరగా సంబంధాన్ని కోల్పోయేలా చేసుకుంటారట.