ఇప్పుడు ఘీ కాఫీ బాగా ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు చాలా మంది పొద్దున తాగే రెగ్యులర్ కాఫీ కంటే కూడా ఈ నెయ్యి కాఫీ ని తాగటం అలవాటు చేసుకుంటున్నారు. ఘీ కాఫీ లేదా బుల్లెట్ కాఫీని తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి.అందుకే సెలబ్రెటీలు సైతం బుల్లెట్ కాఫీతోనే తమ డేను స్టార్ట్ చేస్తున్నామని చెబుుతున్నారు.
ఈ కాఫీని ఉదయాన్నే తీసుకుంటే శరీరానికి ఎన్నో రకాల పోషకాలు లభిస్తాయని నిపుణులు చెప్పారు. ఈ కాఫీ బరువు తగ్గడానికి కూడా హెల్ప్ చేస్తుంది. అలాగే ఈ నెయ్యిలో ఒమేగా 3 వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్నాయి. అందుకే నెయ్యిని కాఫీలో కలుపుకొని తాగితే శరీరంలో హెల్తీ ఫ్యాట్ పెరుగుతుంది. అలాగే జీవక్రీయ ఎంతో మెరుగవుతుంది. ఈ కాఫీని ఉదయాన్నే తీసుకోవటం వల్ల అసిడిటీ సమస్యలు తగ్గటమే కాక జీవక్రియ కూడా మెరుగుపడుతుంది.
ఈ కాఫీని తాగటం వల్ల శరీరంలో ఎనర్జీ పెరుగుతుంది. అలాగే అమ్మాయిల్లో ఎక్కువగా కనిపించే మూడ్ స్వింగ్స్ కు ఈ కాఫీతో చెక్ పెట్టొచ్చు. ఈ నెయ్యిలో విటమిన్ ఏ, విటమిన్ ఈ విటమిన్ కే కూడా ఉంటాయి. అందుకే ఈ నెయ్యి కాఫీని ప్రతిరోజు ఉదయాన్నే తాగటం వల్ల ఈ పోషకాలు మన శరీరానికి లభిస్తాయి.
ముఖ్యంగా చెప్పాలంటే చలికాలంలో నెయ్యి కాఫీ తాగటం వల్ల జీర్ణక్రియకు కూడా ఎంతో మేలు జరుగుతుంది. ఇది బరువు తగ్గడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఇది పొట్టలోని యాసిడ్ పరిమాణాన్ని నియంత్రిస్తుంది. అలాగే ఎంతో ఆరోగ్యకరమైన కొవ్వును పెంచడంతో పాటు ఎక్కువగా ఆకలి వేయకుండా అదుపులో ఉంచుతుంది…
కాఫీ ని తీసుకోవడం వల్ల హార్మోన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. అంతేకాక ఏకాగ్రతను పెంచుతుంది. ఇకపోతే శరీరంలో పేర్కొన్న మొండి కొవ్వును కరిగిస్తుంది. ఈ నెయ్యి కాఫీని తయారు చేసుకోవడానికి ముందుగా కాఫీ పౌడర్ ను నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ నీళ్లు మరిగే టైం లో నెయ్యి కూడా వేసి..కొద్దిసేపు మరగనిస్తే ఘీ కాఫీ రెడీ అయినట్లే. అలాగే వేడి నీళ్లలో కాఫీ పొడి, ఘీ వేసి బాగా బీట్ చేసి కూడా దీనిని తయారు చేస్తారు.