నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోతుంటే బెల్లీ ఫ్యాట్ పెరిగిపోతూ ఉంటుంది. బెల్లీ ఫ్యాట్ ఎక్కువ అయిన కొద్దీ అది ఎన్నో ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల రిస్క్ పెరుగుతుండటంతో..దీనిని తగ్గించుకోవడానికి చాలా మంది ప్రయత్నిస్తుంటారు.
బెల్లీ ఫ్యాట్ వేగంగా తగ్గాలంటే కొన్ని రకాల ఆహారపదార్ధాలకు దూరంగా ఉండాలి . బెల్లీ ఫ్యాట్ అనేది ఆరోగ్యానికి సైలెంట్ రిస్క్. బెల్లీ ఫ్యాట్ కరిగించాలని గట్టిగా అనుకుంటున్న వారి కోసం ఆహారం విషయంలో మాత్రం కచ్చితంగా ఐదు టిప్స్ పాటించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలని అనుకున్నవాళ్లు మొదటగా.. ప్యాక్డ్ ఫుడ్స్,ప్రాసెస్డ్, జంక్ ఫుడ్స్ జోలికి అసలు వెళ్లకూడదు. ఎవరు ఎంత బలవంతం పెట్టినా ఏ మాత్రం టెంప్ట్ అవకుండా నో చెప్పేయాలి.
ఇక రెండో టిప్..బొజ్జ తగ్గించుకోవాలంటూ ఆకుకూరలు ఎక్కువగా తినాలి. బ్రోకలీ,ఉల్లిపాయ తీసుకోండి. కూరగాయలు అన్నీ మంచివే కాబట్టే ఆహారంలో రైస్, చపాతీ వంటివి తగ్గించి కూరలు ఎక్కువగా తినాలి.
మూడో టిప్ ప్రకారం.. బొజ్జ తగ్గించుకోవాలనుకునేవారి డైట్‍లో అవకాడో, వాల్‍నట్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. అవి మంచి ఫ్యాట్ కలిగి ఉంటాయి కాబట్టి మంచి ఫలితాలుంటాయి.కార్బోహైడ్రేట్స్‌కు దూరంగా ఉంటూ..ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఫుడ్స్ తీసుకోవాలి.
నాలుగో టిప్ ప్రకారం.. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే బ్లూబెర్రీలు తీసుకోవాలి. అలాగే ఆహారాన్ని బాగా నమిలి తినాలి. ప్రోటీన్‌తో పాటు కీలకమైన విటమిన్లు, మినరల్స్ ఉండే ఆహారాలు తినాలి.
ఇక ఐదో టిప్‌లో..పోషకాలతో కూడిన డైట్‍తో పాటు వ్యాయామం కూడా ప్రతీ రోజూ చేస్తుండాలి. క్యాలరీలను బర్న్ చేస్తూ.. బెల్లీ ఫ్యాట్ తగ్గించడానికి, బరువు తగ్గడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది. కానీ క్రమం తప్పకుండా ఈ ఐదు పాటిస్తే మాత్రం బొజ్జ తగ్గడం గ్యారంటీ అని నిపుణులు చెబుతున్నారు.