కొద్దిపాటి ఆల్కహాల్ కూడా డేంజర్ అంటున్న యుఎస్ వైద్యులు

Bad News For Alcohol Lovers, Bad News, Alcohol Lovers, Alcohol Is Dangerous, US Doctors, No Level Of Alcohol Consumption Is Safe, Alcohol Effects , Even A Little Alcohol Can Harm Your Health, Drinking Alcohol Effects Health, Disadvantages Of Alcohol, Negative Effects Of Alcohol, Health News, Health Tips, Healthy Food, Healthy Diet, Fitness, Mango News, Mango News Telugu

ఆల్కహాల్ ప్రియులకు అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ క్యాన్సర్ రీసెర్చ్ బ్యాడ్ న్యూస్ చెప్పింది. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ క్యాన్సర్ రీసెర్చ్ బయట పెట్టిన నివేదిక ప్రకారం.. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ ముప్పు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా మెడ, అన్నవాహిక, రొమ్ము, కొలొరెక్టల్, కాలేయం, కడుపు క్యాన్సర్‌ రావచ్చని హెచ్చరిస్తుంది. యుఎస్‌లో 5.4 శాతం క్యాన్సర్‌లు మద్యం వినియోగం వల్లనే అని గుర్తించిన రీసెర్చర్స్ బ‌ృందం.. కొద్దిపాటి ఆల్కహాల్ హానికరం కాదు అన్న మాటను తోసిపుచ్చింది.

ఆల్కహాల్ వల్ల మనిషిలోని DNA దెబ్బతింటుంది. పోషకాలను గ్రహించే శరీర సామర్థ్యాన్ని ఆల్కహాల్ ప్రభావితం చేస్తుంది. అలాగే హార్మోన్ల సమతుల్యతను కూడా మార్చేస్తుంది. యుక్తవయస్సులో మద్యపానం చేయడం వల్ల వృద్ధాప్యంలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గర్భవతిగా ఉన్నప్పుడు మహిళలు ఆల్కహాల్ తాగడం వల్ల పుట్టే శిశువులకు లుకేమియా వచ్చే ప్రమాదం ఉందని అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ క్యాన్సర్ రీసెర్చ్ పేర్కొంది.

యుఎస్‌లో 5.4 శాతం క్యాన్సర్‌లు కేవలం ఆల్కహాల్ తీసుకోవడం వల్లే వస్తున్నాయని అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ క్యాన్సర్ రీసెర్చ్ తేల్చి చెప్పింది. 2011-19 కాలంలో 50 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల రెండు శాతం కొలొరెక్టల్ క్యాన్సర్ పెరుగుదలను కూడా హైలైట్ చేసింది. అయితే ఏ రకమైన ఆల్కహాల్ క్యాన్సర్‌కు దారితీస్తుందో ఇంకా నిర్ధారించలేదు.

కానీ ఆల్కహాల్ లో ఉపయోగించే స్పిరిట్స్‌లోని ఇథనాల్ ప్రధాన ప్రమాద కారకంగా అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ క్యాన్సర్ రీసెర్చ్ అభిప్రాయపడింది. దాదాపు 50 శాతం మంది అమెరికన్లకు ఆల్కహాలిక్ పానీయాలు, క్యాన్సర్ మధ్య ఉన్న ముఖ్యమైన లింక్ గురించి తెలియదని వివరించింది. ఈ సమస్యపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ప్రభుత్వాలకు, వైద్యులకు ఉందని అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ క్యాన్సర్ రీసెర్చ్ తెలియజేసింది.