స్వీట్స్ ఇష్టపడని వారు ఎవరో కానీ ఉండరు. కొంతమంది ఎక్కువ పంచదార ఉన్న డ్రింక్స్, టీలు, కాఫీలు చాలా ఎక్కువగా తాగుతుంటారు. కాని పంచదార ఎక్కువగా తింటే క్యాన్సర్ వస్తుందని పరిశోధనలో వెళ్లడయింది. షుగర్, స్వీటెన్డ్ డ్రింక్స్ కారణంగా కోలోరెక్టల్ క్యాన్సర్ వస్తుందని ఇటువంటి వాటికి దూరంగా ఉండటం మంచిదని డాక్టర్లు చెబుతున్నారు.
అదే విధంగా మెటబాలిక్ సమస్యలు, ఇన్సులిన్ సమస్యలు, కొలెస్ట్రాల్ సమస్యలు ఇంకా ఇంఫ్లేమేషన్ సమస్యలు వస్తాయని డాక్టర్లు హైచ్చరిస్తున్నారు.షుగర్ ఎక్కువగా తింటే రోగాలను కొని తెచ్చుకోవడమే అని హెచ్చరిస్తున్నారు. తాజాగా సర్వేలో చేసిన ఈ స్టడీలో తెలిసిందేమిటంటే సాఫ్ట్ డ్రింక్స్, స్పోర్ట్స్ డ్రింక్స్ ఇంకా తియ్యగా ఉండే టీలు తీసుకునే వారిలో కోలోరెక్టల్ క్యాన్సర్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
పండ్ల రసాలు తీసుకున్న వాళ్లని అంటే ఆపిల్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్ ఇంకా ద్రాక్ష జ్యూస్ మొదలైనవి తీసుకున్న వారిని కూడా గమనించారు. వీరిలో చాలామందికి షుగర్ డ్రింక్స్ వలన ఇబ్బంది ఉన్నట్లు గుర్తించారు. అయితే షుగర్ కొద్దిగా తీసుకున్న వాళ్ల కంటే కూడా ఎక్కువగా తాగిన వాళ్లలో ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది.
అలాగే రోజుకి ఒకసారి జ్యూస్ లు తాగేవాళ్లలో కూడా 32 శాతం రిస్కు ఉంది. అలానే ఈ షుగర్ డ్రింక్స్ కి బదులుగా..షుగర్ లేకుండా కాఫీ లేదా కొవ్వులేని పాలు తాగడం వల్ల 36 శాతం నుంచి 17 శాతం దాకా రిస్కు అనేది తగ్గుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఇటువంటి వాటికి చాలా దూరంగా ఉండటం మంచిదట . వీటికి బదులుగా ఆరోగ్యకరమైన పద్ధతులు పాటిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది.
అయితే ఈమధ్య అవేర్ నెస్ తో పాటు షుగర్ బాధితులు పెరగడడంతో… షుగర్ , స్వీటెనర్స్ వాడడం తగ్గుతోంది. ఇది మంచి విషయమే అయినా.. పంచదార వాడకం పూర్తిగా తగ్గించేలా ప్రతి ఒక్కరూ ఆలోచించాలని వైద్యులు చెబుతున్నారు. తీపి విషాన్ని శరీరానికి దూరంగా ఉంచాలని కోరుతున్నారు.