బస్సు,ఇతర వాహనాల కంటే చాలా మంది కారులో జర్నీని కంఫర్టుగా భావిస్తారు. లాంగ్ జర్నీలకు కూడా కారులనే ఉపయోగిస్తారు. కానీ కారులోని గాలి ప్రాణాంతకమని తాజాగా జరిపిన పరిశోధనలు చెబుతున్నాయంటున్నారు నిపుణులు. కారు వల్ల బయటే కాదు లోపల కూడా తీవ్ర కాలుష్యమే వెదజల్లుతోందని అంటున్నారు. ముఖ్యంగా సమ్మర్‌లో కారులో నుంచి ఎక్కువగా విషపదార్దాలు విడుదలవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. కారు లోపల ఉండే భాగాల్లోంచే ఈ విషగాలి వ్యాపిస్తోందని… ఎండాకాలంలో ఈ పరిస్థితి మరీ తీవ్రంగా ఉంటుందని అంటున్నారు.
నిజానికి ఎండలో వెళ్లలేక చాలా మంది కారు జర్నీని ఇష్టపడతారు. కారు లోపల కంటెన్యూగా ఏసీని ఆన్ చేసి ఉంచడంతో పాటు బయట పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్లల కారు లోపల భాగాలు కాలిపోయే స్టేజికి రావడం ఒక్కోసారి కాలిపోవడం జరుగుతుందట. దీంతో కారు లోపల ఓ రకమైన కార్బన్ విడుదలయ్యే అవకావం ఉంటుందని అంటున్నారు.
2015 నుంచి 2022 మధ్యలో వచ్చిన అన్ని కారు మోడల్స్‌పై కొంతమంది స్టడీ చేశారు. అమెరికన్ నేషనల్ టాక్సికాలజీ ప్రొగ్రామ్ ఈ కార్లకు సంబంధించిన ఇలాంటి పరీక్షలను చేపడుతోంది. పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్, గ్యాస్ కార్లపై పరిశోధనలు చేయగా.. 99 శాతం కార్లల్లో టీసీఐపీపీ అనే కార్సినోజిన్ విడుదలవుతున్నట్లు నివేదికలో బయటపడింది. క్యాన్సర్‌కు కార్సినోజెన్లే ప్రధాన కారణమని వైద్యులు ఇప్పటికే చెప్పారు. కారులో వెలువడే ఈ కార్సినోజెన్ల వల్లే ఇప్పుడు క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉండే అవకాశాలున్నట్లు సర్వే నిపుణులు చెబుతున్నారు.
కారులో వ్యాపించే ఈ కార్సినోజెన్లను డ్రైవర్ ఎక్కువగా పీలుస్తాడు. ఎందుకంటే ప్రతీ రోజు డ్రైవర్ కనీసం 2,3 గంటలు కారు లోపల గుడుపుతాడు.ఒక్కోసారి ఈ సమయం పెరుగుతుంది కూడా. అంతేకాదు కారులో ప్రయాణించే చిన్న పిల్లలపైన కూడా ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అటు డ్రైవర్లకు, ఇటు ప్రయాణించేవారికి కూడా ఇది ప్రాణాంతకమే అంటున్నారు.
కార్సినోజెన్లు వేసవికాలంలో కారులో మరింత ఎక్కువగా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని నివేదికలో ఉంది. కారులోని సీట్లలో వాడే ఫోమ్, దూదిలో రసాయనాలు ఉపయోగించడం వల్ల కూడా ఈ విష పదార్ధాలు మరింత ఎక్కువగా విడుదలౌతాయని నివేదిక తేల్చింది. దీనికి తోడు కారుసీట్ల తయారీ సమయంలో.. కెమికెల్స్ ఉపయోగిస్తున్నప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకుండానే కారులో ఫిట్ చేసేస్తున్నారు. దీంతో ఈ కెమికల్స్ కాకుండా దీనికి ప్రత్యామ్నాయంగా వేరే పదార్థాలను సీట్ల తయారీలో ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY