టిఫిన్ , భోజనం ఇలా ఏం తిన్నా స్పూన్ తో తినొద్దని.. చేత్తో తింటేనే అది మైండ్ ఫుడ్ ఈటింగ్ అవుతుందంటున్నారు. అప్పుడే మనం తినే ఆహారంపై కాన్సన్ట్రేషన్ ఉంటుందంటున్నారు. దీనివల్ల ఎంత తింటున్నామనేది కూడా లెక్క ఉంటుందని.. పైగా కాస్త మెల్లగా తినడం అలవాటు అవుతుందని చెబుతున్నారు. చేతితో తినడంవల్ల కొంచెం తిన్నా.. కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. అదే స్పూన్ తో తింటే మాత్రం ఎంత తిన్నా తిన్నట్టు అనిపించదు. ఎంత టేస్టీ ఫుడ్ తిన్నా.. సాటిస్ఫాక్షన్ అనేదే ఉండదు. పైగా స్పూన్ తో తినడం వల్ల తినే క్వాంటిటీ కూడా ఎక్కువై, బరువు పెరుగుతారు.
స్పూన్, ఫోర్క్ తో తినడం వలన తినే ఫుడ్ ఎంత వేడిగా ఉందో, చల్లగా ఉందో కూడా తెలియదు. కానీ చేతితో తినడం వలన ఫుడ్ చల్లగా ఉన్నా, ఎక్కువ వేడిగా ఉన్నా వెంటనే తెలిసి పోతుంది. చేతితో పట్టుకోవడం వల్ల ఆహారం యొక్క క్వాలిటీ, పరిశుభ్రత కూడా తెలుస్తాయి. దీనివల్ల ఫుడ్ పాయిజనింగ్ నుంచి మనం తప్పించుకోవచ్చని ఆరోగ్యన నిపుణులు అంటున్నారు.
చేత్తో తినడం వల్ల టైప్- 2 అనే డయాబెటిస్ నుంచి తప్పించుకోవచ్చట. ఎలా అంటే చాలా మంది కుదురుగా కూర్చొని తినటానికి టైం లేక స్పూన్ తో స్పీడ్ గా తింటుంటారు. దీని వల్ల మనకు బ్లడ్, షుగర్ లెవల్స్ లో తేడా వచ్చి టైప్- 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. టైప్-2 డయాబెటిస్ తో బాధపడే వాళ్లలో ఎక్కువమంది స్పూన్ తో తినే అలవాటు ఉన్నవాళ్లే అని చాలా స్టడీలో తేలింది. చేత్తో తినడం వలన అరుగుదల సమస్యలు కూడా రావు.
భోజనం, ఇతర ఫుడ్ ఐటమ్స్ చేతితో తీసుకున్నప్పుడు తినడానికి రెడీ అవుతున్నామని మెదడు.. పొట్టకు సిగ్నల్ ను పంపిస్తుంది. దీనివల్ల తిన్న ఫుడ్ త్వరగా అరగడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ స్పూన్ తో తింటే మెదడు నుంచి పొట్టకి ఆ సిగ్నల్స్ వెళ్లవు. దీంతో పాటు చేతివేళ్లపై నార్మల్ ఫ్లోరా అనే బ్యాక్టీరియా ఉంటుంది. దీని ద్వారా మన ఆరోగ్యానికి ఎలాంటి నష్టం కూడా ఉండదు అలాగే బయటి నుంచి శరీరంలోకి వచ్చే హానికరమైన బ్యాక్టీరియాలను ఇది అడ్డుకుంటుంది. నిజానికి ఈ బ్యాక్టీరియాని గొంతు, నోరు, చిన్న పేగులలో అభివృద్ధి చేసుకోవడం చాలా అవసరం. అందుకు ఏవో ప్రయత్నాలు చేయనక్కర లేదు. చాలా సింపుల్ గా చేతితో అన్నం తింటే చాలు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.