పొట్ట చుట్టూ పెరిగే కొవ్వుకు ఇలా చెక్ పెట్టండి..

Check For The Growing Belly Fat Like This, Check For The Growing Belly Fat, Growing Belly Fat, What Causes Belly Fat, Abdominal Fat, Lose Belly Fat, Tips For Belly Fat Lose, Belly Fat, Check The Growing Belly Fat, Gaining Fat Around The Belly, Weight Loss Tips, Weight Loss Meal Plan, Faster Way To Fat Loss, Weight Loss Food, Health News, Health Tips, Healthy Food, Healthy Diet, Fitness, Mango News, Mango News Telugu

శరీరంలో పెరిగిన బరువును తగ్గించుకోవడం అంత ఈజీ కాదు. అందులోనూ పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరిగించటం మరింత కష్టం. అయితే పెరుగుతున్న బొజ్జకు ఆయుర్వేదం ప్రకారం డైలీ లైఫ్ లో కొన్ని సర్దుబాటులతో చెక్ పెట్టొచ్చని నిపుణులు అంటున్నారు. శరీరానికి కావలసిన రోజువారీ కేలరీలలో 70 శాతాన్ని ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజన సమయంలోనే లభించే విధంగా ఆహారాన్ని తినడానికి ప్రయత్నించాలి. ఆ సమయంలో జీర్ణశక్తి ఎక్కువగా ఉంటుంది. ఇక రాత్రి భోజనంలో తక్కువ కేలరీలు ఉండే విధంగా, అది కూడా 7 గంటలకు ముందుగానే తీసుకునేలా ప్లాన్ చేసుకోవాలి.

శరీరంలో కొవ్వు పెరగటానికి పిండి పదార్థాలు ఎక్కువ కారణమవుతాయి. పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగించాలంటే కార్బోహైడ్రేట్ల వినియోగాన్ని తగ్గించాలి. తీపి పానీయాలు, తీపి పదార్థాలు, పాస్తా, రొట్టె, బిస్కెట్లు మరియు నూనెలో వేయించిన ఆహారాలను దూరం పెట్టాలి.ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో మెంతి పిండిని నీటితో కలిపి తినాలి. లేదంటే రాత్రి పడుకునే ముందు కప్పు మెంతులను గ్లాసు నీటిలో నానబెట్టి ఉదయం లేచిన తర్వాత ఖాళీ కడుపుతో ఆ ద్రావణాన్ని సేవిస్తే మంచి ఫలితం ఉంటుంది.

గార్సినయా కంబోజియా ఫ్రూట్ అంటే మలబార్ టామరిండ్‌ను తినడం వల్ల…జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ఇంకా జీవక్రియను పెంచుతుంది. ఇవన్నీ బరువు తగ్గడానికి సహాయపడతాయి.ఆయుర్వేదంలో త్రిఫల చూర్ణం ఒక అద్భుతం. ఆహారంలో భాగంగా త్రిఫల చూర్ణం చేర్చితే శరీరంలోని మలినాలను తొలిగించటమేగాక జీర్ణ వ్యవస్థను చైతన్యవంతం చేస్తుంది. త్రిఫల చూర్ణం ఒక టీస్పూన్ తీసుకుని గోరు వెచ్చని నీటితో కలుపుకుని నైట్ భోజనం తర్వాత తీసుకుంటే చక్కగా పనిచేస్తుంది.

శొంఠిలో ఉండే థర్మోజెనిక్ ఏజెంట్లు కొవ్వు కరగడంలో బాగా ఉపయోగపడతాయి. వేడి నీటిలో శొంఠి కలుపుకుని తాగితే జీవక్రియ పెరగడంతో పాటు అదనపు కొవ్వు కరుగుతుంది. ఇంట్లో అల్లం పౌడర్ లేకపోతే కూరలలో, టీ తో ముడి అల్లం వేసుకున్నా మంచి ఫలితాలు ఉంటాయి.
ఆహారాన్ని ఎక్కువసేపు నమలడం ద్వారా ఎక్కువ లాలాజలం విడుదలయ్యి అది ఆహారంతో కలిసి జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. ఇలా జరిగే క్రమంలో సంతృప్తి హార్మోను విడుదలయ్యి కడుపు నిండినట్లుగా మనస్సును హెచ్చరిస్తుంది. దాంతో బరువు పెరగకుండా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది.

దాహం వేసినప్పుడు ఎక్కువగా వేడి నీటిని త్రాగండి. వేడి నీరు జీవక్రియ బాగా జరిగేలా చేసి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. 30 నిమిషాలు పాటు కొంచెం వేగంగా వాకింగ్ చేయడంతో పాటు, పొట్ట తగ్గడం కోసం ప్రత్యేకమైన యోగాసనాలు చేస్తే… పొట్ట చుట్టు ఉన్న కొవ్వు తొందరగా తరిగిపోతుంది.