డయాబెటిస్ చెప్పేంత పెద్ద జబ్బు కాదు కానీ.. అజాగ్రత్తగా ఉంటే సైలెంట్ కిల్లర్ మారి ప్రాణాలు తీసేస్తుంది. ఒక్కసారి ఒంట్లోకి వచ్చిందంటే జీవితకాలం తిష్ట వేస్తుంది. మైల్డ్ షుగర్, లైట్ షుగర్ అంటూ దీనిని చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ అలాంటి తేడాలుండవని నిపుణులు అంటున్నారు. ఎవరైనా సరే, రక్తంలో గ్లూకోజు పరగడుపున 125 దాటినా, తిన్న 2 గంటల తర్వాత 200 దాటినా వారికి మధుమేహం వచ్చినట్టే.
తప్పనిసరిగా మధుమేహ బాధితులు తమ ఆహార అలవాట్లలో కూడా కొన్ని మార్పులు చేర్చుకోవాలి. వ్యాయామం నుంచి ఆరోగ్యకరమైన ఆహారం వరకు ప్రతిదానిలో కూడా కఠినమైన నియంత్రణ అవసరం.కొంతమంది ఆయుర్వేద వైద్యుల సూచనతో కాకరకాయ రసం తాగడం, నేరేడు గింజలు తినడం వంటి అనేక రకాల చిట్కాలను ఫాలో అవుతుంటారు. అయితే వీటి లాగానే ఖర్జూర గింజలు కూడా మధుమేహ వ్యాధిగ్రస్తులకు భలేగా పనిచేస్తుందని.. ఈ విత్తనాలు ఎంతో మేలు చేస్తాయని నిపుణులు అంటున్నారు.
నిజానికి డయాబెటిస్ ఉన్నవారెవరూ ఖర్జూరాలు అస్సలు తినకూడదు.వీటిలో చక్కెర స్జాయిలు ఎక్కువగా ఉండటంతో వీటిని దూరం పెట్టాలి. కానీ ఖర్జూరం లోపల ఉండే గింజలు వీరికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఖర్జూరం విత్తనాలలో కొన్ని ముఖ్యమైన పదార్ధాలు ఉంటాయి. ఇవి రక్తంలో ఉన్న గ్లూకోజ్‌ను శక్తిగా మార్చడంలో సహాయపడతాయి. అంతేకాకుండా, ఖర్జూరం గింజలలో కూడా ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణ రుగ్మతల చికిత్సలో సహాయపడుతుంది కాబట్టి.. ఈ విత్తనాలు మంచి జీవక్రియను నిర్వహించడానికి మేలు చేస్తాయి. ఖర్జూరంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను బ్యాలెన్స్ చేయడంలో సహాయపడతాయి.
అయితే ఖర్జూర గింజలను ఎలా తినాలంటే కొన్ని నియమాలు ఉన్నాయి. ఖర్జూరం తిన్న తర్వాత విత్తనాలను బాగా కడిగి.. గింజలకు ఖర్జూరం అంటకుండా పూర్తిగా కడగాలి.ఆ తర్వాత విత్తనాలను కొన్ని రోజులు ఎండలో బాగా ఆరబెట్టాలి. ఆ గింజలను తీసుకుని కళాయిలో కాసేపు వేపి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వాటిని మిక్సీలో గ్రైండ్ చేసి ఆ పొడిని గాలి చొరబడని డబ్బాలో పోసుకుని నిల్వ చేసుకోవాలి. ప్రతిరోజూ 1/2 టీస్పూన్ పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి, ఆ నీటిని ఖాళీ కడుపుతో తాగాలి. ఇలా చేస్తే 7 రోజుల్లోనే మంచి ఫలితాలను చూస్తారని నిపుణులు చెబుతున్నారు.