ఎగ్ షెల్స్‌ను ఇలా వాడండి..
There are many uses for eggshells
సాధారణంగా గుడ్డు పెంకులు బయట పడేస్తారు. మహా అయితే కొంతమంది మొక్కలకు ఎరువుగా వేస్తారు. గుడ్డులో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ప్రోటీన్ అధికంగా ఉంటుందని అందరికీ తెలుసు. గుడ్డులోని తెల్లటి భాగం మాత్రమే కాదు, పచ్చసొన చర్మం , జుట్టుకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ గుడ్డు షెల్ కూడా ఉపయోగకరమని చాలామందికి తెలియదు. మెయిన్ గా చర్మ సంబంధిత సమస్యలను తొలగించడంలో గుడ్డు షెల్ సహాయపడుతుంది. ఇది చర్మాన్ని సహజంగా పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. ఇది చర్మం నుండి మృత చర్మాన్ని తొలగించడంలో కూడా సహాయపడుతుంది. దీని కోసం గుడ్డు పెంకులు పొడిగా , మెత్తగా చేసి పొడి చేయాలి. ఈ పొడిని వివిధ రకాలుగా ఉపయోగించవచ్చు.
చర్మపు మచ్చలను తొలగించడానికి..
ఒక గుడ్డు షెల్‌లో రెండు చెంచాల తేనె, నిమ్మరసం వేసి బాగా కలిపి.. పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై 15 నిమిషాల పాటు ఉంచి తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్‌ను అప్లై చేయడం ద్వారా, కొన్ని వారాలలో ముఖం మీద గ్లో కనిపించడం ప్రారంభమవుతుంది.
చర్మంలో తేమను పెంచడానికి..
ఎగ్ షెల్ లో కలబంద జెల్ మిక్స్ చేసి పేస్ట్ సిద్ధం చేసుకోండి. ఈ పేస్ట్‌ని ఫేస్ మీద 10 నుండి 15 నిమిషాల పాటు ఉంచి, తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి. ఈ పేస్ట్‌ని రెగ్యులర్‌గా ఉపయోగించడం వల్ల చర్మంలో తేమ పెరగడం గమనిస్తారు.
జుట్టు ఒత్తుగా, బలంగా మార్చడానికి..
గుడ్డు పెంకులు ఉపయోగించి హెయిర్ మాస్క్ తయారు చేసుకోవచ్చు. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే, గుడ్డు షెల్ పౌడర్ , పెరుగు కలపడం ద్వారా హెయిర్ మాస్క్ తయారు చేసుకోవచ్చు. ఈ పేస్ట్‌ని తలకు అప్లై చేసి, సుమారు 45 నిమిషాల తర్వాత జుట్టును కడగాలి. ఈ హెయిర్ మాస్క్ వేసుకోవడం ద్వారా జుట్టు బలంగా , ఒత్తుగా మారుతుంది.
ఇవే కాకుండా, జుట్టు జిడ్డుగా కనిపిస్తే గుడ్డు షెల్ పౌడర్‌లో తెల్ల సొనను కలిపి పేస్ట్‌ని సిద్ధం చేయాలి. ఈ పేస్ట్‌ని 10 నిమిషాల పాటు అలాగే ఉంచి, తర్వాత తేలికపాటి షాంపూతో శుభ్రం చేసుకుంటే జుట్టులోని జిడ్డుతనం పోతుంది.