బొటాక్స్‌ ట్రీట్మెంట్‌ గురించి మీకివి తెలుసా?

చాలామంది సినీ తారలు, సెలబ్రెటీలు 50 ఏళ్లు దాటినా ఇప్పటికీ 30 ఏళ్లలోనే ఉన్నట్లుగా కనిపిస్తుంటారు. అసలు వీరు అందాన్ని తిని బతుకుతారా ఏంటి అన్న కామెంట్లు కూడా వింటాం. అయితే ఇలా చాలా మంది ముడతలు లేని చర్మం కోసం ఉపయోగించే రహస్యం అందాల రహస్యంగానే చాలా రోజులు ఉండిపోయినా.. కొన్నాళ్లుగా వారు చేయించుకునే ట్రీట్మెంట్ పేరే బొటాక్స్‌ అని అందరికీ తెలిసిపోయింది.

నిజానికి బొటాక్స్ అనేది బోటులినమ్ టాక్సిన్ యొక్క శుద్ధి చేయబడిన రూపం అట. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇది బాక్టీరియం క్లోస్ట్రిడియం బోటులినమ్ నుంచి పొందిన ప్రోటీన్. ముడతలు లేని ఫేస్ కావాలనుకునే వారికి, ఇది సౌందర్య ప్రభావాన్ని సాధించడానికి నిర్దిష్ట ముఖ కండరాలలోకి ఇంజెక్ట్ చేయబడుతుంది. దీని వల్ల చర్మం బిగుతుగా మారడంతో పాటు మృదుత్వాన్ని కూడా ఇస్తుంది.

బొటాక్స్ వల్ల యవ్వనంగా కనిపించడమే కాకుండా..ముడతలు, నుదురు గీతలు, పగిలిన చర్మాన్ని తొలగిస్తుందట. అంతేకాదు దీర్ఘకాలిక మైగ్రేన్‌లు, అధిక చెమటలు, అతి చురుకైన మూత్రాశయం కండరాల నొప్పులకు కూడా బొటాక్స్ ట్రీట్మెంట్‌ను ఉపయోగిస్తారు.
బొటాక్స్ వల్ల చాలా ఉపయోగాలున్నాయి. బొటాక్స్ అనేది త్వరిత కానీ నాన్-ఇన్వాసివ్ ప్రక్రియ. ఇది సర్జరీ , అనస్థీషియా వంటివి చేయించుకోకుండానే ఈ ట్రీట్మెంట్ చేస్తారు. ఇంజక్షన్ ద్వారానే ఈ చికిత్స ఉంటుంది.

బొటాక్స్ ఇంజెక్షన్ యొక్క రిజల్ట్.. ట్రీట్మెంట్ అయిన కొన్ని రోజుల తర్వాత కనిపిస్తాయి.అలాగే చాలా నెలల పాటు దీని ప్రభావం ఉంటుంది. ఇది లాంగ్ యూత్‌ఫుల్ లుక్‌ని ఇస్తుంది. ముసలితనాన్ని మార్చగల సామర్థ్యంతో పాటు, బొటాక్స్ విశ్వాసాన్ని కూడా పెంచుతుంది.
బొటాక్స్ అందం కోసం మాత్రమే కాకుండా.. ఇది మైగ్రేన్లు, ఒత్తిడి కండరాలు, అధిక చెమట వంటి అనారోగ్యాల వల్ల కలిగే నొప్పి , అసౌకర్యాన్ని కూడా తగ్గిస్తుంది.దీని వల్ల కొత్తగా ముడుతలు కూడా రావు.

అయితే బొటాక్స్ వల్ల కొంత చెడు కూడా ఉంటుందట. బొటాక్స్ కూడా దాని పరిమితులను కలిగి ఉంది.దీనివల్ల కొన్ని సార్లు వాపు, ఎరుపు, తలనొప్పి, కనురెప్పలు వంగిపోవడం, కళ్లు పొడిబారడం మరియు అలెర్జీ వచ్చే అవకాశం ఉంటుంది.ఒక్కోసారి రూపురేఖలు మారిపోతాయి. అలాగే ఒక టాక్సిన్‌కు పదేపదే బహిర్గతం అయిన తర్వాత,బాడీ దానికి వ్యతిరేకంగా ప్రతిరోధకాలను ఉత్పత్తి చేసి.. దాని ప్రభావాన్ని తగ్గిస్తుంది. పైగా బొటాక్స్ ఇంజెక్షన్లు చాలా ఖరీదయినవి.