భోజనం తర్వాత టూత్‌పిక్‌ వాడుతున్నారా?

టూత్‌పిక్‌తో దంతాలను శుభ్రం చేసుకోవడం చాలామందికి అలవాటు.కానీ ఆ అలవాటు అస్సలు మంచిది కాదట. దీనివల్ల శరీరంలో ఇతర సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సాధారణంగా ఆహారం దంతాల లోపల ఇరుక్కుపోతే టూత్ పిక్ సహాయంతో వాటిని తొలగిస్తారు.ముఖ్యంగా చాలా మంది తిన్న వెంటనే దంతాలలో ఇరుక్కున్న ఆహారాన్ని తొలగించడానికి వీటిని ఉపయోగిస్తుంటారు. మరికొంతమంది అయితే దీనిని ఒక అలవాటుగా మార్చుకుంటారు. అయితే టూత్‌పిక్‌తో దంతాలను శుభ్రం చేసుకోవడం అస్సలు మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు.

ఆహారం దంతాల లోపల ఇరుక్కుపోతే, టూత్ పిక్ సహాయంతో ఇరుక్కున్న పదార్ధాలను తొలగించడానికి ప్రయత్నిస్తారు. ఇలా తరచూ చేయడం వల్ల చిగుళ్లు తీవ్రంగా దెబ్బతింటాయి. తెలియకుండానే చిగుళ్లు వీకవడంతో పాటు..బాగా గాయపడి రక్తస్రావం అవుతాయి. దీనివల్ల నోటి లోపల బ్యాక్టీరియా కూడా ఏర్పడుతుందని నిపుణులు అంటున్నారు.అంతేకాదు ఆ బ్యాక్టీరియా శరీరమంతా వ్యాపించే ప్రమాదం ఉంటుంది.

ముఖ్యంగా రూట్ కెనాల్స్‌ ట్రీట్మెంట్ చేసుకున్నవారు దంతాలను శుభ్రం చేసుకోవడానికి టూత్‌పిక్స్‌ను అస్సలు ఉపయోగించకూడదని డెంటిస్టులు చెబుతున్నారు. దీనివల్ల దంత మరింతగా సమస్యలు పెరుగుతాయి. ఒకవేళ ఆహారం దంతాలలో ఇరుక్కుపోతే, వాటిని గోరువెచ్చని నీటితో బాగా పుక్కిలించి శుభ్రం చేసుకోవాలి. ఇలా దంతాలను శుభ్రపరచడం వల్ల బ్యాక్టీరియా సమస్య కూడా తగ్గుతుంది. లేదంటే స్మూత్ బ్రషెల్ ఉన్న బ్రష్ తో నోటిని శుభ్రం చేసుకోవచ్చు.