మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని అందరికి తెలుసు. కానీ మనం ఏ ఆహారాలు తింటే మంచిది అనే విషయంలో ఎప్పుడూ అయోమయానికి గురవుతున్నారా. కొందరు పండ్లు తినమని చెబుతారు. మరికొందరు కూరగాయలు, పప్పులు మొదలైన వాటిని తినమని చెబుతారు. అయితే ఏ ఆహారం అయిన అవసరానికి మించి తింటే ఆరోగ్య సమస్యలను కూడా కలిగిస్తాయి. వీటినే సైడ్ ఎఫెక్ట్స్ అంటారు. ఉదాహరణకు కొన్ని కూరగాయలు మనకు మంచి ప్రయోజనాలను అందిస్తాయి. కానీ సైడ్ ఎఫెక్ట్ రూపంలో శరీరంలో యూరిక్ యాసిడ్ పెంచుతుంది. దీనివలన గౌట్, కిడ్నీల్లో రాళ్ళు, ఇతర సమస్యలు వస్తాయి. అయితే యూరిక్ యాసిడ్ సమస్య ఉన్న వారు ఈ క్రింది అహారాలను మితంగా తీసుకుంటే మంచిది.
వంకాయ
వంకాయలో అధిక మొత్తంలో ప్యూరిన్ ఉంటుంది. అందువల్ల, వంకాయను తరచుగా తినడం వల్ల కొందరి శరీరంలో యూరిక్ యాసిడ్ పెరుగుతంది.
పుట్టగొడుగు
పుట్టగొడుగు పెద్ద మొత్తంలో ప్రోటీన్ మరియు ఫైబర్ ఉంటుంది. పుట్టగొడుగులను తీసుకోవడం వల్ల బాడీకి మంచి ప్రోటిన్ అందినప్పటికి ఎక్కువగా తీసుకోవడం వల్ల మన శరీరంలో యూరిక్ యాసిడ్ పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
పచ్చి బఠానీలు
ఇప్పుడు పచ్చి బఠానీల సీజన్ మొదలైంది. యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నవారు పచ్చి బఠానీలను ఎక్కువగా తింటే మరిన్ని సమస్యలను ఎదుర్కోవడం ఖాయం కావునా మోతాదు మేరకే తినడం మంచిది.
క్యాబేజీ
క్యాబేజీలో అధిక మొత్తంలో యూరిక్ యాసిడ్ ఉంటుంది, ఇది మనకు వివిధ పోషకాలతో పాటు అపారమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అయితే దీన్ని కూడా పరిమితి లేకుండా తినడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ పెరుగుతుంది.
పాలకూర
పాలకూరలో ప్రోటిన్ మరియు ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇందులో ప్యూరిన్ కూడా ఎక్కువగా ఉంటుందని, తరచూ తీసుకోవడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
note:ఒకవేళ మీ శరీరంలో ఇప్పటికే యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండి, మీరు దానితో బాధపడుతున్నట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించి సరైన సలహాలతో పాటు చికిత్స తీసుకోవడం ఉత్తమం.