
చాలామంది ఏ పనీ చేయకపోయినా తీవ్రంగా అలిసిపోయినట్లు అయిపోతారు. అరగంటకో, గంటకో శారీరక బలహీతకు గురవుతుంటారు. అయితే ఇది అడ్రినల్ ఫెటీగ్ అనే రుగ్మత కావచ్చునని డాక్టర్లు అంటున్నారు . ఇటీవల చాలా మందిని ఈ సమస్య వేధిస్తున్నట్లు చెబుతున్నారు. ఎటువంటి పని చేయకపోయినా, ఫిజికల్ యాక్టివిటీస్ కూడా ఏమీ లేకపోయినా నీరసించి పోవడం అడ్రినల్ ఫెటీగ్ ప్రధాన లక్షణమని అంటున్నారు. మనిషి శరీరంలోని కిడ్నీల పైభాగంలో అడ్రినల్ గ్రంథులు ఉంటాయని..అవి సరిగ్గా పని చేయకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తుతుందని. అందుకే దీనిని అడ్రినల్ ఫెటీగ్ అని పేరు పెట్టినట్లు వైద్యులు చెబుతున్నారు.
పెద్దగా శారీరక శ్రమ లేకపోయినా కూడా ఏదో పెద్ద పనిచేసినట్లు.. తీవ్రమైన అలసటను ఎదుర్కోవడం, ఒత్తిడిగా ఫీలవడం వంటివి ఫేస్ చేస్తారు. అలాగే నిద్రలేమితో బాధపడటం, బద్ధకంతో ఎక్కువసేపు ఒకే దగ్గర కూర్చోవడం లేదా పడుకోవడం దీని లక్షణాలు. అంతేకాదు వీరికి తీపి, ఉప్పగా ఉండే ఆహారాలు ఎక్కువగా తినాలనిపిస్తుంది. అయితే స్త్రీలలో, ప్రీ మెన్‌స్ట్రువల్ సిండ్రోమ్, మెనోపాజ్ సమయాల్లో కూడా తీవ్రమైన అలసట కనిపించవచ్చు. కాబట్టి ప్రతీ అలసటను అడ్రినల్ ఫెటీగ్ అనుకోవాల్సిన అవసరం లేదు.
శరీర అవసరాలను తీర్చడంలో అడ్రినల్ గ్రంథులు సరిగ్గా పనిచేయనప్పపుడు ఈ అడ్రినల్ ఫెటీగ్ ఏర్పడుతుంది. కొన్ని రకాల ఆహారాలు, మెడిసిన్స్ ద్వారా ఇది తగ్గుతుంది. ముఖ్యంగా పాంతోతేనిక్ యాసిడ్ కంటెంట్ కలిగి ఉండే ఆహారం (విటమిన్ B5) దీనిని నివారిస్తుంది. ఎందుకంటే ఇది అలసట, ఒత్తిడి ఏర్పడే సమయంలో కార్టిసాల్ ఎంజైమ్‌ను అడ్డుకుంటుంది. అలలాగే పరిడాక్సిన్ అనే విటమిన్ B6 కంటెంట్ కలిగిన మందులు టాబ్లెట్స్ అండ్ సిరప్‌ల రూపంలోనూ లభిస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు.
దానిమ్మ, నారింజ, పాలకూర, బచ్చలి కూరతో పాటు సిట్రస్ ఫ్రూట్స్ ఆహారంలో తీసుకుంటే అడ్రినల్ అలసటను తగ్గుతుంది. పోషక విలువలు కలిగిన ఆహారాలు, ముఖ్యంగా తాజా పండ్లు, కూరగాయలు తరచూ తీసుకోవాలి. దీనివల్ల రోగనిరోధకశక్తి పెరగడంతో పాటు తీవ్రమైన అలసటకు కారణమైన అడ్రినల్ ఫెటీగ్ కూడా తగ్గే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY