ప్రస్తుతం ఎవరిని చూసినా ఉరుకుల పరుగుల జీవితమే. చాలా కొద్ది మంది తప్ప మిగిలిన వారెవరూ కూడా తమ ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. కొంతమంది వర్క్ బిజీలో పడి, మరికొంతమంది బద్దకం వల్ల సరైన ఆహారాన్ని తీసుకోవడంలో ఆసక్తి చూపించడం లేదు.
చాలామంది తమకు టైమ్ లేదంటూ ఎక్కువగా జంక్ ఫుడ్‌తో కడుపు నింపేసుకుంటున్నారు. ప్రమాదం అని తెలిసినా కూడా జంక్ ఫుడ్ తినడంతో.. ఎన్నో అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే అనారోగ్యాలకు ప్రధాన కారణం వారు తీసుకునే నాణ్యతలేని ఆహారమేనని నిపుణులు చాలా సందర్భాల్లో చెప్పారు.
తాజాగా ఇదే విషయాన్ని మరోసారి చెప్పిన ఎన్‌ఐఎన్ అంటే.. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ భారతీయుల కోసం కొత్త ఆహార నియమావళిని విడుదల చేసింది. ప్రజలంతా తమ ఆహారం, జీవనశైలిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎన్ఐఎన్ సూచించింది.
శారీరక శ్రమ లేకపోవడం వల్ల గుండెజబ్బులు, బీపీ ముప్పు భారీగా పెరుగుతున్నాయని..అలాగే షుగర్ కూడా కంట్రోల్ ఉండటం లేదని చెప్పింది. శారీరక శ్రమ వల్ల అన్ని సమస్యల నుంచి వచ్చే ఇబ్బందులు 80 శాతం వరకు తగ్గుతుందని తెలిపింది. అంతేకాదు అకాల మరణాల ముప్పునూ కూడా ఫిజికల్ ఎక్సర్‌సైజులు తగ్గిస్తాయని పేర్కొంది.
ఇంట్లో వండుకునే వంటల్లో నూనెల వాడకాన్ని బాగా తగ్గించాలని చెప్పిన ఎన్‌ఐఎన్.. నూనెగింజలు, నట్స్, సీఫుడ్ ద్వారా మనుషుల శరీరానికి అవసరమైన ఫ్యాటీ యాసిడ్స్‌ను పొందాలని సలహా ఇచ్చింది. నాణ్యతలేని , జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల విపరీతంగా పొట్ట ఎక్కువగా పెరగటం, కాస్త శ్రమపడినా కూడా విపరీతమైన ఆయాసం రావడం, కంటిచూపు మెల్లగా తగ్గడం వంటి సమస్యలు వస్తాయని ఎన్‌ఐఎన్ హెచ్చరించింది.
ముఖ్యంగా షుగర్స్ కలిపిన ఎలాంటి డ్రింక్స్‌కు అయినా సరే దూరంగా ఉండాలని ఎన్‌ఐఎన్ తెలిపింది. ఆహారాన్ని లిమిటెడ్‌గా తీసుకోవాలని.. ధాన్యాలు, మిల్లెట్స్, కూరగాయలు, పండ్లు, నట్స్ వంటివి ఎక్కువగా ఉపయోగించాలని పేర్కొంది. మన శరీరానికి మనం ఒకరోజు ఇచ్చే మొత్తం క్యాలరీల్లో చక్కెర ద్వారా అందే క్యాలరీలు 5 శాతానికి మించకుండా చూసుకోవాలని..కొవ్వు ద్వారా 30 శాతానికి మించొద్దని ఎన్‌ఐఎన్ హెచ్చరించింది.
మరోవైపు మన శరీరం బలంగా తయారు కావడానికి చాలామంది ప్రొటీన్ పౌడర్లు ఎక్కువగా తీసుకుంటున్నారని కానీ అలా తీసుకోవద్దని అది చాలా ప్రమాదమని ఎన్‌ఐఎన్ పేర్కొంది. ప్రోటీన్ పౌడర్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలకు కూడా ముప్పు ఉంటుందని తెలిపింది. అంతేకాదు మనిషికున్న వ్యాధుల భారంలో 56 శాతం తిండి వల్లే కలుగుతున్నాయని ఎన్‌ఐఎన్ వివరించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY