మార్కెట్లో నకిలీ పన్నీర్.. టెస్ట్ చేసి తింటేనే బెటర్..

Fake Paneer In The Market Its Better To Test It And Eat It

పాలతో తయారు చేసిన పన్నీరు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చాలామంది తినడానికి ఇష్టపడతారు. పన్నీర్‌లో అనేక రకాల పోషకాలు కనిపిస్తాయి. ఇవి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కానీ ఇటీవల మార్కెట్లె అసలు కంటే నకిలీ పన్నీర్ అమ్మకాలు జరుగుతున్నాయని ..దీనిని తినడం వల్ల మీ ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పన్నీర్ ప్రోటీన్ కొవ్వు ప్రధాన వనరులలో ఒకటి. అంతే కాకుండా ఖనిజాలు, కార్బోహైడ్రేట్లు, శక్తి, కాల్షియం, భాస్వరం, విటమిన్లు వంటి అనేక ముఖ్యమైన పోషకాలు కూడా ఉన్నాయి. ఒకవైపు అనేక రకాల పోషకాలు కలిగిన నిజమైన పన్నీరు మనకు అనేక ప్రయోజనాలను తెస్తుంటే…మరోవైపు, హానికరమైన పదార్ధాలను కలపడం ద్వారా తయారు చేసిన నకిలీ పన్నీరు అనేక విధాలుగా మనల్ని అనారోగ్యానికి గురి చేస్తుంది. నకిలీ పన్నీరు తినడం వల్ల టైఫాయిడ్, అతిసారం, కామెర్లు, పుండ్లు వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. నకిలీ పన్నీర్ తిన్న తర్వాత కడుపు నొప్పి, తలనొప్పి, చర్మం మీద దద్దుర్లు, అజీర్ణం లాంటి సమస్యలు వస్తున్నాయి.

పన్నీర్ ..భోజన ప్రియులకు ఫేవరేట్ ఫుడ్. ఇక వెజిటేరియన్లకైతే మరీ ఎక్కువ. పన్నీర్ కర్రీ, మసాలా పన్నీర్, పాలక్ పన్నీర్ ఇలా చాలా రకాలుగా తింటూ ఎంజాయ్ చేస్తారు. పన్నీర్ ను స్నాక్స్ గా..కర్రీగానూ తినొచ్చు. ఈ ప్రయోజనాలన్నీ నిజమైన పన్నీర్ తోనే సాధ్యమవుతాయి. దీనికి విరుద్ధంగా నకిలీ పన్నీర్ తినడం వల్ల మీ ఆరోగ్యం పై చెడు ప్రభావం చూపిస్తుంది.

అయితే కొన్ని టిప్స్ ద్వారా నకిలీ పన్నీర్‌ ను గుర్తించొచ్చట. ఒరిజినల్ పన్నీర్ మృదువుగా ఉంటుంది. కానీ పన్నీర్ గట్టిగా ఉంటే అది పక్కా డూప్లికేట్ అనే అర్థం. నకిలీ పన్నీరును సులభంగా తినలేము. కొంచెం రబ్బర్ లాగా సాగుతుంది. నకిలీ పన్నీరును ఇలా చెక్ చేయొచ్చు. పన్నీర్‌ను వేడి నీటిలో వేసి ఆపై చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత పన్నీర్ మీద 2-3 చుక్కల అయోడిన్ టింక్చర్ వేయండి. పనీర్ రంగు నీలం రంగులోకి మారితే అది కచ్చితంగా నకిలీ అని అర్థం.