ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండానే అందరికీ జుట్టు రాలే సమస్య వస్తుంది. చిన్న వయసులో కొంతమంది బట్టతలతో బాధపడుతున్నారు. మారుతున్న జీవనశైలితో పాటు నీటి పొల్యూషన్ , గాలి పొల్యూషన్ వల్ల చాలామంది జుట్టు రాలిపోతుందన్న టెన్షన్ కు గురవుతున్నారు. అయితే ఇలాంటివారు తమ డైలీ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడంతో పాటు..కొన్ని జాగ్రత్తలు తీసుకుని రెగ్యులర్ గా ఫాలో అయితే ఫలితాలుంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
100గ్రాముల కొబ్బరి నూనెలో 100 మిల్లీ గ్రాముల ఆలివ్ నూనె, 50 మిల్లీగ్రాముల బాదం నూనె, 30 మిల్లీ గ్రాముల ఆముదాన్ని కలిపి హెడ్ బాత్ చేసేముందు అయినా.. ముందు రోజు అయినా రాసి మసాజ్ చేసుకుంటే..జుట్టు చాలా ఒత్తుగా పెరుగుతుంది. అలాగే ఉల్లిపాయ నూనె కూడా జుట్టు పెరగడానికి ఉపయోగపడుతుంది. 200 గ్రాముల కొబ్బరి నూనె లేదా ఆవనూనె తీసుకోవాలి. ఈ ఆయిల్ ను..బాణలిలో వేసి వేడి చేసి అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కప్పు కరివేపాకు వేసి బాగా మరిగాక చల్లార్చి.. జుట్టుకు పట్టిస్తే జుట్టు బాగాపెరుగుతుంది
అంతేకాదు చికెన్, చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తులు, బీన్స్ వంటి ప్రోటీన్-రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. అలాగే విటమిన్లు ఎ, సి, ఇ, బి కాంప్లెక్స్ విటమిన్లు, జింక్, ఐరన్ కూడా జుట్టు ఆరోగ్యానికి చాలా అవసరం. ఇది పండ్లు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్ వంటి ఆహారాలలో కనిపిస్తుంది. అలాగే జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం. తగినంత నిద్ర కూడా చాలా ముఖ్యం. రోజూ కాసేపు వ్యాయామం చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరిగిపడి జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. టెన్షన్స్ ఉన్నా జుట్టు రాలుతుంది కాబట్టి.. ఒత్తిడి లేకుండా ఉండేలా చూసుకోవాలి.