అధిక బాడీ మాస్ ఇండెక్స్ మాత్రమే కాదు, పొట్ట చుట్టూ కొండలా పేరుకుపోయిన కొవ్వు కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ విషయాన్ని ఈ పరిశోధనను ఫోర్టిస్ హాస్పిటల్, AIIMS, నేషనల్ డయాబెటిస్ ఒబెసిటీ అండ్ కొలెస్ట్రాల్ ఫౌండేషన్ సంయుక్తంగా నిరూపించాయి.
BMI నియంత్రణలో ఉన్నా కూడా. కానీ పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతే అది ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతున్నాయి. పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు అనేక ఇతర వ్యాధులకు ఆహ్వానం పలుకుతోందని వీరి అధ్యయనంలో తేలింది. ఊబకాయం వల్ల మధుమేహం, గుండె జబ్బులు, రక్తపోటు వంటి ఎన్నో వ్యాధులు కూడా పెరుగుతున్నాయి. కొత్త అధ్యయనంలో, ఊబకాయం రెండు వర్గాలుగా విభజించారు..
మొదటిది అయిన సాధారణ స్థూలకాయంలో వ్యక్తి BMI పెరుగుతుంది. ఊబకాయం శరీరంపై కనిపిస్తుంది.కాకాపోతే ఇది రోజువారీ పని లేదా ఆరోగ్యంపై అంత పెద్దగా ప్రభావాన్ని చూపించదు. అంటే అలాంటి వ్యక్తికి ఊబకాయం పనికి పెద్దగా ఆటంకంగా మారదు. అయినా కూడా మొదట్లోనే దీనిని నియంత్రించకపోతే, అది తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుంది.
ఇక రెండవ దశలో ఊబకాయం బయటకు కనిపిస్తుంది అలాగే.. శరీరంలోని అనేక ఇతర భాగాలకు హాని కూడా చేస్తుంది. ఇది అనేక వ్యాధులకు కారణం అవుతుంది. స్థూలకాయుల్లో మధుమేహం, గుండె జబ్బులు, మెదడుకు సంబంధించిన వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తేలింది. ఇటువంటి పరిస్థితిలో కొత్త అధ్యయనం ఈ రెండు రకాల ఒబెసిటీని సరిగ్గా అర్థం చేసుకోవడానికి, స్థూలకాయాన్ని సరిగ్గా గుర్తించడంలోనూ సహాయపడుతుంది.
15 ఏళ్ల తర్వాత ఊబకాయంపై జరిగిని కొత్త పరిశోధనలో అనేక విషయాలు వెల్లడయ్యాయి. కొత్త అధ్యయనంలో, ఒబెసిటీని కంట్రోల్ చేయడానికి వివరణాత్మక సమాచారం ఇచ్చారు. అంతే కాకుండా బెల్లీ ఫ్యాట్ వల్ల వచ్చే ఇతర వ్యాధులను కూడా ఈజీగా గుర్తించడం ఎలాగో కూడా వివరించారు. దీంతో ఊబకాయం వల్ల కలిగే వ్యాధుల చికిత్సకు ఇప్పుడు సులభంగా, మరింత సౌకర్యవంతంగా జరిగే అవకాశం ఉంటుంది.
నిజానికి ఊబకాయంపై కొత్త మార్గదర్శకాలు 2009లోనే వచ్చాయి. కానీ దానిలో చాలా విషయాలు స్పష్టంగా వివరించలేదు. కానీ ఇప్పుడు చేపట్టిన కొత్త అధ్యయనం వల్ల స్థూలకాయం, దానికి సంబంధించిన ఇతర సమస్యలను ఈజీగా గుర్తించడానికి సహాయపడుతుంది.