ఆ దేశంలో వంద ఏళ్లు ఎలా బతకగలుగుతున్నారో తెలుసా? అవి అస్సలు తినరట..

ప్రపంచంలోని చాలా దేశాలు తక్కువ ఆయుర్దాయం మరియు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ, జపాన్, దక్షిణ కొరియా, హాంగ్‌కాంగ్ వంటి కొన్ని దేశాల ప్రజలు సుదీర్ఘకాలం ఆరోగ్యంగా, ఆనందంగా జీవిస్తున్నారు. నిపుణుల ప్రకారం, వీరి దీర్ఘాయుష్షుకు ప్రధాన కారణం ఆరోగ్యకరమైన జీవనశైలి మరియు ప్రత్యేక ఆహారపు అలవాట్లు. అధిక ప్రాసెస్ చేయబడిన ఆహారాలను వదిలి, పోషకాహారంతో కూడిన సహజమైన ఆహారాన్ని ప్రాధాన్యం ఇవ్వడం వల్ల వీరి శరీరానికి అవసరమైన పోషకాలు సమతుల్యంగా అందుతున్నాయి.

మొనాకో – అత్యధిక ఆయుర్ధాయంతో పేరు గాంచిన దేశం
మొనాకో దేశంలోని ప్రజలు సగటున 80 ఏళ్లు పైగా జీవిస్తారు. పురుషులు సుమారు 89 సంవత్సరాలు, మహిళలు 84 సంవత్సరాలు జీవిస్తారని విశ్లేషకులు చెబుతున్నారు. వీరి జీవనశైలి చాలా ప్రత్యేకమైనది. ఆరోగ్యకరమైన ఆహారం, ఆర్థిక భద్రత, ఆనందకరమైన జీవితం వీరికి అధిక ఆయుర్ధాయాన్ని అందిస్తున్నాయని నిపుణులు భావిస్తున్నారు.

జపనీయుల ప్రత్యేక ఆహారపు అలవాట్లు
జపాన్ ప్రజలు అధికంగా చేపలు, సముద్ర ఆహారం, తాజా కూరగాయలు, బియ్యం, సముద్రపు పాచి (స్పైరులీనా), సోయా ఉత్పత్తులను ఆహారంలో భాగంగా తీసుకుంటారు. వారు ఒకేసారి అధికంగా తినకుండా చిన్న భాగాలుగా భోజనం చేయడం ద్వారా జీర్ణక్రియను మెరుగుపరచుకుంటారు. చక్కెర, కొవ్వు తగ్గించిన ఆహారం, గ్రీన్ టీ తాగడం, కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడం వీరికి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ప్రధాన కారణాలు.

ఆలివ్ నూనెకు అధిక ప్రాముఖ్యత
మొనాకో, మధ్యధరా దేశాల ప్రజలు ఎక్కువగా ఆలివ్ నూనెను ఉపయోగిస్తారు. సముద్ర ఆహారం, తాజా కూరగాయలు, తక్కువ ప్రాసెస్ చేసిన ఆహారం వీరి ఆరోగ్యానికి తోడ్పడుతున్నాయి. ఫ్రెంచ్ మరియు ఇటాలియన్ వంటల ప్రభావంతో వీరి ఆహారం ఎక్కువగా ఆరోగ్యకరంగా ఉంటుంది. ‘బార్బాగియువాన్’ (స్టఫ్డ్ ఫ్రిటర్), ‘పిస్సలాడియర్’ (ఉల్లిపాయలు, ఆంకోవీస్, ఆలివ్‌లతో ఫ్లాట్ బ్రెడ్) వంటి వంటకాలు వీరి జీవన విధానంలో ప్రధానంగా కనిపిస్తాయి.

ఆరోగ్యకరమైన జీవన విధానం దీర్ఘాయుష్షుకు కారణం 
ఆహారంతో పాటు నిత్యం వ్యాయామం, యోగ, ధ్యానం, సరైన జీవనశైలి పాటించడం వల్ల వీరు ఆరోగ్యంగా జీవిస్తారని నిపుణులు చెబుతున్నారు. సరైన ఆహారం, ఆందోళనలేని జీవనం, ఆరోగ్యపరమైన అలవాట్లు ఈ దేశాల ప్రజలకు అధిక ఆయుర్ధాయాన్ని అందిస్తున్నాయి.