పొట్ట తగ్గించే పప్పులు..

Stomach Relieving Pulses, Pulses, Fenugreek, Red Lentils, Stomach Relieving, Belly Fat, Weight Loss, Weight Loss Tips, Weight Loss Meal Plan, Faster Way To Fat Loss, Weight Loss Food, Health News, Health Tips, Healthy Food, Healthy Diet, Fitness, Mango News, Mango News Telugu

పొట్టను ఎలా తగ్గించుకోవాలో, లోపల పేరుకుపోయిన కొవ్వును ఎలా కరిగించుకోవాలో తెలియక చాలా మంది నానా తంటాలు పడుతుంటారు. ఎన్ని ఎక్సర్‌సైజులు చేసినా, వర్కవుట్లు చేసినా… పొట్ట మాత్రం వేలాడుతూనే ఉండటంతో ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు. ఇలాంటివారు మూడు పప్పులతో తమ సమస్యకు చెక్ పెట్టొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఉలవలు, ఎర్రకందిపప్పు, పెసరపప్పులు తింటూ పొట్టలో కొవ్వు కరిగించేసుకోవచ్చని అంటున్నారు. రెగ్యులర్ గా ఇవి తింటూ ఉంటే… పొట్ట ఆటోమేటిక్‌గా తగ్గిపోతుందని చెబుతున్నారు. ఇప్పటివరకూ మీరు ఎలాంటి డైట్ , జాగ్రత్తలు తీసుకుంటున్నా.. ఇకపై మీ డైట్‌లో ఈ మూడు పప్పుల్నీ చేర్చుకుంటే.. పొట్టలో కొవ్వు ఆటోమేటిక్ గా తగ్గిపోతుందని అంటున్నారు.

పెసరపప్పు…
రకరకాల వ్యాధుల అంతు చూసే గుణం పెసరపప్పుకి ఉంది. ఈ పప్పు ఈజీగా అరుగుతుంది. దీని నిండా పోషకాలే. ఇది బరువు తగ్గేందుకు చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులో ఫైబర్ కూడా ఎక్కువే. అందువల్ల దీన్ని తింటే… ఇంకేమీ తినబుద్ధి కాదు. ఫలితంగా బరువు తగ్గొచ్చు. ఇది పొట్ట సమస్యనే కాదు.. శరీర బరువు కూడా తగ్గేందుకు వీలు కల్పిస్తుంది

ఎర్రపప్పు..
ఎర్రపప్పునే కొంతమంది మసరపప్పు అంటారు. మనం ఎప్పుడో గానీ వండుకోం కానీ ఈ పప్పు చాలా మంచిది. ఈజీగా జీర్ణం అవుతుంది. దీనిలో చక్కటి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అవి బాడీకీ చాలా అవసరం. పైగా ఈ పప్పులో కొవ్వు తక్కువ. ఫైబర్ ఎక్కువ. పైన చెప్పుకున్నట్లు ఫైబర్ వల్ల ఈ పప్పు తిన్నాక… పొట్ట నిండిన ఫీల్ కలుగుతుంది. ఇంకేమీ తినబుద్ధి కాదు. అందువల్ల పొట్ట సమస్య తగ్గుతూ ఉంటుంది.

ఉలవలు..
ఉలవల వల్ల బరువు తగ్గడమే కాదు… ఓవరాల్ హెల్త్‌కి కూడా ఇవి చాలా మంచివి. బాడీకి కావాల్సిన అన్ని పోషకాలూ వీటిలో ఉంటాయి. ఉలవలు… పొట్టలో కొవ్వును తగ్గిస్తాయి. దీని వల్ల పొట్ట సైజ్ రోజురోజుకు తగ్గుతుంది. అంతేకాదు ఉలవలు కిడ్నీలో రాళ్లను సైతం కరిగిస్తాయి. అందువల్ల ఉలవల్ని రెగ్యులర్‌గా వాడితే పొట్ట తగ్గడంతో పాటు ఇతర లాభాలు కూడా పొందొచ్చు.