గులాబీలు అంటే చాలా మందికి ఇష్టం. ఇవి అలంకరణకే కాక బ్యూటీ ప్రొడక్ట్స్‌లోనూ బాగా ఉపయోగిస్తారు. అయితే గడ్డి గులాబీ లేదా టేబుల్ రోజా వల్ల కూడా ఆరోగ్యానికి, అందానికి చాలామంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. టేబుల్ రోజా లో ఉన్న ఔషధ గుణాలు తెలిస్తే , ఈ మొక్కను అసలు ఎవరు వదిలిపెట్టరు.
ఈ మొక్క చర్మం మీద ఉండే నల్లటి మచ్చలను, మొటిమలను తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఈ మొక్కలో వున్న పువ్వును కోసుకొని, ఒక మెత్తని పేస్టులాగా చేసుకోవాలి. తర్వాత అందులోకి కొంచెం తేనెను కలిపి ముఖానికి పూయాలి. తర్వాత చల్లని నీటితో ముఖం కడుక్కోవడం వల్ల, ముఖం అందంగా మెరుస్తుంది.ఇలా వారానికి 2-3 సార్లు చేయడం వలన తప్పకుండా ఫలితం లభిస్తుంది.
ఇక జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉండేవారికి ఈ మొక్క బాగా ఉపయోగపడుతుంది. ఈ మొక్కల కాండం, ఆకులను బాగా ముద్దగా నూరి, అందులోకి కొంచెం స్వచ్ఛమైన కొబ్బరి నూనె వేసి బాగా మిక్స్ చేసి జుట్టుకు పట్టించుకోవడం వలన జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుంది. ఈ మొక్క యొక్క రసాన్ని ఏదైనా గాయాలు అయినప్పుడు పట్టించడం వలన, ఆ గాయం నుంచి రక్త ప్రసరణ ఆగిపోతుంది.
ఇక అంతే కాకుండా చర్మంపై వచ్చిన పొక్కులతో పాటు..క్షయ వ్యాధి పొక్కులను పోగొట్టుకోవడానికి కూడా గడ్డి గులాబీ ఉపయోగపడుతుంది. ఈ పూలను బాగా నూరి చర్మంమీద పట్టించడం వలన అవి తగ్గిపోతాయి.ఈ మొక్కల వేరుతో కషాయం చేసుకుని తాగడం వలన దగ్గు నుంచి విముక్తి పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు.