ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యంగా ఉండడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఆరోగ్యం, ఫిట్ గా ఉండడం కోసం, ఆరోగ్యానికి మేలు చేసే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడానికి అయినా వెనుకడుగు వేయడం లేదు. మనం హెల్దీగా ఉండాలంటే మంచినీళ్లు ఎక్కువగా తీసుకోవాలని పెద్దలు, వైద్యులు చెబుతూ ఉంటారు.
అందుకే ఉదయం లేవగానే కొంతమంది మంచినీళ్లని తాగుతూ ఉంటారు. వారి వారి వయసును, బరువును బట్టి..రెండున్నర నుంచి మూడు లీటర్ల వరకు రోజంతా మంచినీళ్లు తీసుకుంటూ ఉంటారు. కొంతమందికి మాత్రం ఉదయం లేవగానే నీళ్లు తాగరు. ఉదయం లేవగానే నీళ్లు తాగితే కడుపులో తిప్పినట్లుగా ఉంటుందని అంటారు.
అయితే ఎలాంటి వారయినా సరే.. పొద్దున లేచాక జీరా వాటర్ తాగితే పొట్ట మొత్తం క్లీన్ అయి ఆరోగ్యంగా ఉండొచ్చని నిపుణులు అంటున్నారు. నీటిలో, జీలకర్ర వేసి మరిగించి ఆ జీలకర్రని వడగట్టేసి ఆ జీలకర్ర నీళ్లు తాగాలి.ఈ జీరా వాటర్ ని తీసుకోవడం వల్ల నోటికి రుచిగా ఉంటుంది. డైజెస్టివ్ ఎంజైమ్స్ బాగా రిలీజవుతాయి. దీనివల్ల డైజెస్టివ్ సిస్టం పవర్ ఫుల్ గా ఉంటుంది.
అంతేకాకుండా లోపల గ్యాస్ ఫామ్ అవ్వకుండా, ఫ్రీగా ఆహారం జీర్ణం కావడానికి ఉపయోగపడుతాయి . జీలకర్ర అజీర్తి సమస్యలను కూడా పోగొడుతుంది. ఈ జీరా వాటర్ ని రెగ్యులర్‌గా తీసుకుంటే, మెటబాలిక్ రేట్ కూడా పెరుగుతుంది. బరువు తగ్గడానికి, శరీరంలోని కొవ్వుని కరిగించడానికి కూడా జీరా వాటర్ బాగా ఉపయోగపడతాయి. ఉదయం లేచిన వెంటనే మాత్రమే కాదు రోజంతా జీరా వాటర్ ను తీసుకోవచ్చు.