యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగిపోయి ఇబ్బందులు పడేవారు..కొన్ని రకాల జ్యూసుల తాగి తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. వీరు ఉదయాన్నే ఒక గ్లాసు నిమ్మరసం తాగడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గించుకోవచ్చు. నిమ్మరసంలో విటమిన్ సీ.. ఉండటం వల్ల శరీరంలో టాక్సిన్లు తొలగించడంలో సహాయపడుతుంది.
అలాగే వాము వాటర్ యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. వాము నీళ్లతో జీర్ణవ్యవస్థ సమర్థంగా పనిచేయడం వల్ల శరీరంలో టాక్సిన్లు తొలగిపోతాయి. దీంతో పాటు యూరిక్ యాసిడ్ స్థాయిలు బాగా కూడా తగ్గుతాయి.
వాములోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరంలోని వాపులను తగ్గిస్తూ.. యూరిక్ యాసిడ్ స్థాయిలను సమతుల్యం చేస్తాయి. శరీరాన్ని శుద్ధి చేయడమే కాకుండా.. మలబద్ధకం సమస్యను నివారించడానికి వాము వాటర్ బాగా పనిచేస్తాయి. మెటాబాలిజాన్ని వేగవంతం చేయడంతో పాటు శరీరంలో టాక్సిన్లు త్వరగా బయటకు పంపడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి.
ఉసిరికాయ జ్యూస్ యూరిక్ యాసిడ్‌ను తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. ఇది విటమిన్ సీతో నిండి ఉండటంతో.. శరీరంలో ఉన్న టాక్సిన్లు తొలగిపోతాయి. రెగ్యులర్ గా గూస్బెర్రీ జ్యూస్ తాగడం వల్ల స్కిన్ కూడా ఆరోగ్యంగా మారుతుంది.
యూరిక్ యాసిడ్‌ను తగ్గించడంలో తులసి టీ సహాయపడుతుంది. దీనిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది శరీరంలోని ఇన్ఫ్లమేటరీ సమస్యలను బాగా తగ్గిస్తుంది. ఉదయం పూట తులసి టీ తాగడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలతో కూడుకున్న పసుపు టీ.. శరీరంలోని యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. పసుపు టీ తాగడం ద్వారా ఇతర అనారోగ్య సమస్యల నుంచి కాపాడుకోవచ్చు. అల్లం టీ కూడా యూరిక్ యాసిడ్‌ను తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది. అల్లం లో ఉన్న యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలవల్ల ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు.
అలాగే దోసకాయ జ్యూస్ శరీరంలోని టాక్సిన్లు తొలగించి, యూరిక్ యాసిడ్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. శరీరాన్ని శుభ్రంగా ఉంచడంతో పాటు.. ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.అంతేకాదు వీటితో పాటు మంచి ఆహారం, వ్యాయామం కూడా చేస్తే యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గుతాయి. ఈ విధంగా చేస్తే ఆరోగ్యంగా ఉండగలుగుతారు.