చిన్నా లేదు పెద్దా లేదు అందరికీ ఇప్పుడు తెల్ల జుట్టే కనిపిస్తుంది. ఒకప్పుడు నలభై దాటినవారిలో ఒక్క తెల్ల వెంట్రుక కనిపిస్తే అదో విశేషంగా చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు టీనేజ్ పిల్లల్లోనూ గ్రే హెయిర్ కామన్ అయిపోయింది. మారుతున్న ఆహారపుటలవాట్లతో పాటు, పెరుగుతున్న కాలుష్యం, జంక్ ఫుడ్ లు ఇలా రకరకాల కారణాలతో తెల్ల జుట్టు కామన్ గా అయిపోయింది.
అయితే చాలామంది మార్కెట్లో దొరికే వివిధ హెయిర్ డై లను వాడి నల్ల జుట్టుగా మార్చుకుంటున్నారు. కానీ ఇది జుట్టు ఊడిపోవడానికి, స్కిన్ అలర్జీలకు కారణం అవుతున్నాయి. అందుకే నేచురల్ గా ఆయిల్ ను ఇంట్లో నే తయారు చేసుకుని వాడితే మంచి ఫలితాలుంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దీనితో పాటు మంచి ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఈ స్వచ్ఛమైన హెయిర్ ఆయిల్ ను తయారు చేయడానికి మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె, పిడికెడు కరివేపాకు కావాలి.
స్వచ్ఛమైన హెయిర్ ఆయిల్ ను ఇలా సిద్ధం చేయాలి..
ఒక ఇనుప పాత్రలో కొబ్బరినూనె, కరివేపాకు వేసి నల్లగా అయ్యేవరకు వేడి చేయాలి. నూనె నల్లగా మారే వరకు వేడి చేస్తూ ఉండాలి. నల్లగా మారిన తర్వాత స్టౌ ఆఫ్ చేసుకుని ఆ నూనె చల్లారిన తర్వాత గాజు సీసాలో నిల్వ చేసుకుని హెడ్ బాత్ చేసే రెండు , మూడు గంటల ముందు తలకు అప్లై చేసుకోవాలి.
ఈ నూనెను ఉపయోగించిన ప్రతిసారీ కొద్దిగా వేడిచేస్తే.. ఇది తలపై చాలా త్వరగా పనిచేస్తుంది. జుట్టు చివర్ల నుంచి తల మొదళ్లు వరకూ పూర్తిగా నూనె రాసుకోవాలి. తర్వాత పది నిమిషాల పాటు మసాజ్ చేసి రెండు, మూడు గంటలు అలాగే ఉంచాలి. తర్వాత తేలికపాటి షాంపూతో వాష్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేసుకోవచ్చు. కరివేపాకులో నెరిసిన వెంట్రుకలను తొలగించి మీ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే గుణం ఉంటుంది. అలాగే కరివేపాకు మీ జుట్టు రెండింతలు వేగంగా పెరగడానికి కూడా సహాయపడుతుంది.