మీల్‌మేకర్స్‌నే చాలా మంది సోయా చంక్స్‌గా పిలుస్తారు. మీల్ మేకర్స్ లో.. శరీరానికి కావాల్సిన ప్రోటీన్, ఫైబర్ కూడా లభిస్తుంది.దీనిని చాలా మంది శాకాహారులు మాంసాహారానికి బదులుగా వినియోగిస్తారు. మీల్‌మేకర్స్‌లో పోషకాలు కూడా ఎక్కువ పరిమాణంలో అందుబాటులో ఉంటాయి.. కాబట్టి క్రమం తప్పకుండా వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి.
మీల్‌మేకర్స్‌లో ప్రోటీన్ ఎక్కువ పరిమాణంలో లభిస్తుంది. ఈ ప్రోటీన్ శరీరానికి కణాల నిర్మాణానికి, మరమ్మతులు, కణజాలాల పెరుగుదలకు కీలక పాత్ర పోషిస్తుందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. చిన్న పిల్లలకు ఇది తప్పకుండా పెట్టాల్సిన ఆహారంగా నిపుణలు చెబుతూ ఉంటారు.
మీల్‌మేకర్స్‌లో కొలెస్ట్రాల్ ఉండదు కనుక.. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీనివల్ల ఎలాంటి గుండె సమస్యలు రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే వీటిని రెగ్యులర్ గా తినడం వల్ల ఇతర వ్యాధుల ప్రమాదం రాకుండా కూడా కాపాడుకోవచ్చు. .
మీల్‌మేకర్స్‌ను సోయా బీన్స్ నుంచి తయారు చేస్తారు కాబట్టి వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆకలిని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా బరువు తగ్గాలనుకునే వారెవరయినా తరచుగా సలాడ్స్‌లో వీటిని చేర్చుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. అలాగే బరువు తగ్గాలని అనుకునేవారు వీటిని తరచూ తీసుకోవాలి.
మీల్‌మేకర్‌లో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. కనుక ఇది ఎముకల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల వ్యాధులను తగ్గించడానికి కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
మీల్‌మేకర్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. యాంటి ఆక్సిడెంట్స్ కణాలను నష్టం నుంచి రక్షించడానికి సహాయపడతాయి. దీనివల్ల కొన్ని రకాల క్యాన్సర్‌ల ప్రమాదాన్ని తగ్గించేందుకు మీల్ మేకర్స్ సహాయపడతాయని కొన్నిఅధ్యయనాలు తేల్చాయి.