5 రకాలు ఫుడ్స్‌తో ఈజీగా బరువు తగ్గొచ్చట..

You Can Lose Weight Easily With 5 Types Of Foods, You Can Lose Weight Easily, Weight Lose 5 Types Of Foods, Weight Lose Foods, 5 Types Of Foods For Weight Lose, Breakfast, Eggs, Lose Weight Easily, Lose Weight With 5 Types Of Food, Want To Lose Weight?, Weight Lose Tips, Health Tips, Healthy Food, Healthy Diet, Fitness, Mango News, Mango News Telugu

చాలామంది బరువు తగ్గడానికి రకరకాల డైట్ ఫాలో అవుతూ ఉంటారు. ఇలాంటి వారు కొద్దిపాటి వ్యాయామంతో పాటు డైట్ లో ఈ 5 రకాలు ఆహారాలు యాడ్ చేసుకుంటే చాలు ఈజీగా బరువు తగ్గతారని నిపుణులు అంటున్నారు.నిజానికి ఉదయం ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకుంటే రోజు మొత్తం హుషారుగా ఉండొచ్చని పెద్దలు చెబుతుంటారు. అందుకే మంచి పోషకాలు ఉండేలో బ్రేక్ ఫాస్ట్ తినడం ముఖ్యం.
1.గుడ్డు..
గుడ్లలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఆకలిని తీర్చడంలో సహాయపడుతుంది. అందుకే బరువు తగ్గాలనుకునేవారు బ్రేక్ ఫాస్ట్ లో ఉడకబెట్టిన ఎగ్స్ కచ్చితంగా తినాలి. ఎగ్స్ ఒక్కటే తినలేమని అనుకునేవాళ్లు దానికి కొన్ని కూరగాయలను యాడ్ చేసుకొని తినవచ్చు. ఇవి తినడానికి తేలికగా ఉంటాయి కడుపుని ఎక్కువసేపు నిండుగా ఉంచుతాయి.
2.వోట్మీల్
వోట్మీల్ ఒక ఆరోగ్యకరమైన రుచికరమైన అల్పాహారం. ఇందులో తక్కువ కేలరీలు, ఫైబర్, ప్రోటీన్ ఉంటుంది. ఇది కడుపు నిండా తినాలన్న కోరికను తగ్గిస్తుంది. జీర్ణక్రియ ప్రక్రియను నెమ్మదిగా చేస్తుంది. దీని వల్ల ఎక్కువ సమయం ఆకలి అనిపించదు. కావాలంటే దీనికి కివీ పండును యాడ్ చేసుకొని తినవచ్చు. ఇందులో విటమిన్లు, పొటాషియం పుష్కలంగా ఉంటాయి.
3. గ్రీక్ పెరుగు
గ్రీక్ పెరుగు మామూలు పెరుగు కంటే రుచికరంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఈ పెరుగులో సాధారణ పెరుగు కంటే ఎక్కువ ప్రోటీన్లు, తక్కువ పిండి పదార్థాలు ఉంటాయి. దీనిలో మీరు స్ట్రాబెర్రీలు, అరటిపండ్లను కలిపి తీసుకోవచ్చు.
4.స్మూతీ
అల్పాహారం కోసం స్మూతీలను తీసుకోవచ్చు. ఇందులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. వీటికి మీరు పండ్లు, డ్రై ఫ్రూట్‌లను మిక్స్ చేసుకొని తినవచ్చు. చియా విత్తనాలను కూడా కలుపుకోవచ్చు. ఇందులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ కడుపులోని గ్రెలిన్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.
5. అవకాడో
అవకాడో ఒక సూపర్ ఫుడ్. దీనిలో తరిగిన ఉల్లిపాయలు, టమోటాలు, ఉప్పు, మిరియాలు కలుపుకొని తినవచ్చు. ఇది మీ ఆకలిని శాంతపరుస్తుంది. ఆహారం తినాలనే కోరికను తగ్గిస్తుంది. ఇందులో మంచి కొవ్వు ఉంటుంది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. గుండె సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.