చిన్నపిల్లలు లేదు పెద్దవాళ్లు అని లేదు.. ఇప్పుడు ఎక్కడ చూసిన ఒబెసిటీతోనే బాధపడుతున్నారు. దీంతో చాలా మంది బరువు తగ్గడానికి నానా తంటాలు పడుతున్నారు. అయితే యాపిల్ సైడర్ వెనిగర్‌ను తీసుకునే విధంగా తీసుకుంటే..వేగంగా బరువు తగ్గుతారని పరిశోధకులు చెబుతున్నారు.
యాపిల్ సైడర్ వెనిగర్‌ను వీటితో కలిపి తీసుకోవాలి..గోరు వెచ్చని నీటిని తాగితే బరువు తగ్గుతారని అందరికీ తెలుసు. అయితే ఇప్పటి నుంచి ఆ గోరు వెచ్చటి నీటిలో యాపిల్ సైడర్ వెనిగర్ ను కలిపి తీసుకోండి. ఇలా రెండు పూటలా అంటే ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా తీసుకోవాలి. వరుసగా మూడు నెలల పాటు ఇలా చేస్తే మెరుగైన ఫలితాలు కలుగుతాయి. అలాగే ఫ్రూట్ సలాడ్స్‌లో, వెల్లుల్లితో పాటు యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి తీసుకున్నా కూడా బరువు తగ్గడానికి అద్భుతంగా సహాయపడుతుంది.
ఒబెసిటీతో బాధ పడేవారు ఎక్కువగా పండ్ల రసాలను తీసుకుంటే మంచిదని డాక్టర్లు చెబుతూ ఉంటారు. ఎందుకంటే లిక్విడ్స్ త్వరగా ఎనర్జీ గా మార్చడమే కాకుండా.. వీటిలో కెలోరీలు తక్కువగా ఉంటాయి. ఇక నుంచి ఎవరైనా ఏ పండ్ల రసం తీసుకున్నప్పుడు దానిలో 2 టీ స్పూన్లు యాపిల్ సైడర్ వెనిగర్ ను కలిపి తీసుకోండి. ఇది బరువు తగ్గించడంతో పాటు చక్కటి శరీర ఆకృతిని కూడా కలిగేలా చేస్తుంది.బరువు తగ్గాలని ప్రయత్నించేవారిలో చాలామంది గ్రీన్ టీ తాగుతారు. అయితే అదే గ్రీన్ టీ లో కూడా కాస్త యాపిల్ సైడర్ వెనిగర్ ను కలిపి తీసుకుంటే సులువుగా బరువు తగ్గుతారు.
2 టీ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్‌లో కొంచెం దాల్చిన చెక్క పొడిని కలుపుకోవాలి. ఒక గ్లాసు నీటిలో ఈ రెండింటిని కలిపి ఉదయం, సాయంత్రం తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతారు. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.
పైన చెప్పుకున్న చిట్కాలు సాధారణంగా మనం చేసేవే అయితే.. వాటిలో కాస్త యాపిల్ సైడర్ వెనిగర్ ను జోడిస్తే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. అయితే కొంతమందికి యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకున్న తర్వాత ఎసిడిటీ, గ్యాస్ ట్రబుల్ వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే దీనిని తీసుకోవడం ఆపేయాలి.