నేటి డిజిటల్ ప్రపంచంలో మీ ముఖం, మీ గొంతు, మీ పేరే మీ అతిపెద్ద ఆస్తి! కానీ, మీకు తెలియకుండానే వాటిని ఎవరైనా వాడేసి డబ్బులు సంపాదించుకుంటే? లేదా డీప్ ఫేక్ (Deepfake) టెక్నాలజీతో మీ ప్రతిష్టను దెబ్బతీస్తే? ప్రస్తుతం సెలబ్రిటీల నుండి సామాన్యుల వరకు అందరినీ భయపెడుతున్న అంశం ఇది. అందుకే మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ వంటి టాప్ సెలబ్రిటీలు తమ హక్కుల కోసం కోర్టు మెట్లు ఎక్కారు.
అసలు ‘పర్సనాలిటీ రైట్స్’ (Personality Rights) అంటే ఏమిటి?
ఒక సెలబ్రిటీ పేరును, ఫోటోను యాడ్స్‌లో వాడటం నేరమా?
మీ మేనరిజమ్స్ మరియు వాయిస్‌ను ఇమిటేట్ చేస్తే చట్టం ఏం చెబుతోంది?
కేవలం సెలబ్రిటీలకేనా.. సామాన్యులకు కూడా ఈ హక్కులు ఉంటాయా?
సోషల్ మీడియా ట్రోల్స్ మరియు మీమ్స్ చేసే వారికి ఎదురయ్యే లీగల్ చిక్కులేంటి?
డిజిటల్ యుగంలో మీ ప్రైవసీని ఎలా కాపాడుకోవాలి? చట్టపరంగా మీకు ఉన్న రక్షణలేంటి? అన్న విషయాలను అత్యంత స్పష్టంగా తెలుసుకోవడానికి ‘Deep Talks with Deepti’ ఛానల్లోని ఈ ప్రత్యేక వీడియోను తప్పక చూడండి. మీ ఐడెంటిటీని కాపాడుకోవడానికి ఈ అవగాహన ప్రతి ఒక్కరికీ అవసరం!








































