వర్షం కురిసిన తర్వాత మొక్కలు చాలా తాజాగా, పచ్చగా కనిపిస్తాయి. దీని వెనుక ఉన్న అసలు రహస్యం వర్షపు నీటిలో ఉండే అధిక నైట్రోజన్. గాలిలో ఉండే నైట్రోజన్ ఉరుములు, మెరుపుల కారణంగా విడిపోయి, వర్షపు నీటిలోని ఆక్సిజన్‌తో కలిసి మొక్కలు గ్రహించగలిగే ‘నైట్రేట్స్’గా మారుతుంది.
మొక్కల పెరుగుదలకు, ఆకులు పచ్చగా ఉండటానికి మరియు ప్రోటీన్ల తయారీకి ఈ నైట్రోజన్ ఎంతో అవసరం. అందుకే వర్షపు నీటిని వృధా చేయకుండా నిల్వ చేసుకుని, మీ గార్డెన్‌లోని మొక్కలకు ఉపయోగిస్తే అవి మరింత బలంగా పెరుగుతాయి. ప్రకృతి ప్రసాదించిన ఈ సహజ ఎరువును సద్వినియోగం చేసుకోవాలని ‘భూలోక స్వర్గం’ యూట్యూబ్ ఛానల్ వీడియో ద్వారా సూచిస్తున్నారు.







































