ప్రముఖ యూట్యూబర్ సాహితి Sahithi Life Tales అనే యూ ట్యూబ్ చానల్ ద్వారా కెనడాలో ని పలు ఆసక్తికరమైన అంశాలు.. ఎవరికీ తెలియనివి, అందరికీ ఉపయోగపడే విషయాలపై వీడియోలు చేసి యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేస్తున్నారు. ఈ వారం కెనడాలో వీకెండ్ లైఫ్ స్టయిల్ ఎలా ఉంటుందో చెబుతున్నారు సాహితి. అక్కడ ఉదయం నిద్రలేచిన దగ్గర్నుంచి వారు ఏం చేస్తారు.. కెనడాలో షాపింగ్ ఎలా ఉంటుంది. సరదాగా బయటకు వెళ్లినప్పుడు ఏం తింటారు. వీక్ డేస్ ను ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనే విషయాలను వివరంగా చెబుతూ చూపించారు. అక్కడ ఉన్న ప్రత్యేకతలతో పాటు మరిన్ని ఇంట్రెస్టింగ్ గా ఉన్న అంశాల గురించి కూడా వివరించారు. మరి మీరు కెనడా వాసుల లైఫ్ స్టయిల్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి.