నేడు భారత్, న్యూజిలాండ్‌ మధ్య తోలి టీ20

1st T20I Match In Auckland, 2020 Latest Sport News, 2020 Latest Sport News And Headlines, India vs New Zealand, India vs New Zealand Match, India vs New Zealand Match Live Updates, latest sports news, latest sports news 2020, Mango News Telugu, sports news

భారత్-న్యూజిలాండ్‌ మధ్య ఐదు టీ20ల సిరీస్ లో భాగంగా ఆక్లాండ్ లోని ఈడెన్ పార్క్ వేదికగా జనవరి 24, శుక్రవారం నాడు తోలి టీ20 జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ మ్యాచ్ మొదలవుతుంది. ఇటీవలే శ్రీలంక, ఆస్ట్రేలియాలపై సిరీస్‌ లు గెలిచిన భారత్ జట్టు ఈ పర్యటనలో కూడా సత్తా చాటాలని చూస్తుంది. ఇప్పటివరకు న్యూజిలాండ్‌ తో భారత్‌ 11 టీ20 మ్యాచులు ఆడగా కేవలం మూడు మ్యాచుల్లోనే విజయం సాధించింది. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో భారత్ ఐదో స్థానంలో కొనసాగుతుండగా, న్యూజిలాండ్‌ ఆరో స్థానంలో ఉంది. ఇక ఈ సిరీస్ కు గాయం కారణంగా శిఖర్ ధావన్ అందుబాటులో లేకపోవడంతో రోహిత్‌ శర్మతో పాటు రాహుల్‌ ఓపెనింగ్‌ చేయనున్నాడు. కెప్టెన్ విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, మనీశ్‌ పాండేలు ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్ కు దిగనున్నారు. ఇటీవల కోహ్లి చేసిన వ్యాఖ్యలకు అనుగుణంగా రాహుల్‌ ను వికెట్ కీపర్‌గా కొనసాగిస్తే తుదిజట్టులో రిషబ్ పంత్ కు చోటు దక్కకపోవచ్చు.

అలాగే స్వదేశంలో జరిగిన సిరీస్ లలో ఐదుగురు బౌలర్లతోనే ఆడిన భారత్ జట్టు ఈసారి ఆరో బౌలర్‌ను ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది. ఆరో బౌలర్ కోసం మొగ్గు చూపితే ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబే కు అవకాశం దక్కవచ్చు. శివమ్ దూబేకు చోటు దక్కితే ఏడో స్థానంలో రవీంద్ర జడేజా లేదా వాషింగ్టన్ సుందర్‌లో ఎవరో ఒకరే ఎంపికయ్యే అవకాశం ఉంది. మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రాతో పాటుగా, నవదీప్ సైనీ లేదా శార్దూల్ ఠాకూర్ కు చోటు దక్కవచ్చు. స్పిన్నర్లలో చాహల్ కంటే కుల్దీప్ యాదవ్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. మరో వైపు కివీస్ జట్టులో బ్యాటింగ్‌ ఆర్డర్లో గప్టిల్‌, కెప్టెన్ విలియమ్సన్, రాస్‌ టేలర్‌ వంటి అనుభవజ్ఞులు ఉన్నారు. అలాగే బౌల్ట్, ఫెర్గూసన్, హెన్రీ వంటి బౌలర్లు జట్టులో లేకపోవడంతో బౌలింగ్ విభాగం కొంచెం బలహీనంగా ఉంది. ఈడెన్‌ పార్క్‌ గ్రౌండ్ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలం కావడంతో ఈ మ్యాచ్ లో మంచి స్కోర్ నమోదు కావచ్చు.

తుది జట్లు (అంచనా) :

భారత్ జట్టు: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్ / రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, నవదీప్ సైని, జస్ప్రీత్ బుమ్రా

న్యూజిలాండ్ జట్టు: మార్టిన్ గుప్టిల్, కోలిన్ మున్రో, కేన్ విలియమ్సన్ (కెప్టెన్ ), టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), కోలిన్ డి గ్రాండ్‌హోమ్, రాస్ టేలర్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్, స్కాట్ కుగ్లీజ్న్, టిమ్ సౌతీ, బ్లెయిర్ టిక్నర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + twelve =