నేడే బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర-4 ముగింపు సభ, ముఖ్యఅతిథిగా కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి

Bandi Sanjay 4th Phase Praja Sangrama Yatra Concluding Meeting Today Union Minister of State Sadhvi Niranjan Jyoti will Attend, Bandi Sanjay Praja Sangrama Yatra-4, Bandi Sanjay Praja Sangrama Yatra, Praja Sangrama Yatra-4 closing meeting today, Union Minister Sadhvi Niranjan Jyoti , Union Minister Sadhvi Niranjan Jyoti as Chief Guest, Praja Sangrama Yatra, Telangna BJP Chief Bandi Sanjay, Mango News, Mango News Telugu, Telangna BJP President Bandi Sanjay, Bandi Sanjay Yatra Closing Meet, Telangna BJP, Sadhvi Niranjan Jyoti, Praja Sangrama Yatra Latest News And Updates

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ సెప్టెంబర్ 12వ తేదీ నుంచి చేపడుతున్న నాలుగో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ నేటితో(సెప్టెంబర్ 22) ముగియనుంది. సెప్టెంబర్ 12న కుత్బుల్లాపూర్ శ్రీ చిత్తారమ్మ దేవి దేవాలయం నుంచి బండి సంజయ్ నాలుగో విడత పాదయాత్రను ప్రారంభించగా, నేడు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని పెద్ద అంబర్ పేట వద్ద యాత్రను ముగించనున్నారు. నేడు ఎల్బీ నగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల పరిధిలోని నేషనల్ డీర్ పార్క్, భాగ్యలక్ష్మీ కమాన్, హయత్ నగర్ బస్టాప్, గ్రీన్ వెల్ఫేర్ కాలనీ, పెద్ద అంబర్ పేట్ మీదుగా సభా ప్రాంగణం వరకు బండి సంజయ్ పాదయాత్ర సాగనుంది.

మొత్తం 10 రోజుల పాటు నాలుగో విడత యాత్ర జరగగా, కుత్బుల్లాపూర్, కూకట్​పల్లి, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మల్కాజిగిరి, మేడ్చల్, ఉప్పల్, ఎల్బీనగర్​, ఇబ్రహీంపట్నం ఇలా 8 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా బండి సంజయ్ 115.3 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టారు. ఇక నాలుగో విడత యాత్ర ముగింపు సందర్భంగా గురువారం సాయంత్రం 4 గంటలకు పెద్ద అంబర్ పేట్ మున్సిపల్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ మరియు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖల సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సభకు భారీగా జన సమీకరణ చేపట్టేందుకు బీజేపీ నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + nineteen =