హైదరాబాద్‌: బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ‘తెలంగాణ విమోచన దినోత్సవం’ వేడుకల్లో పాల్గొన్న బండి సంజయ్

Bandi Sanjay Participates Telangana Liberation Day Celebrations at BJP Office Hyderabad, Bandi Sanjay Participates Telangana Liberation Day, Bandi Sanjay Telangana Day at BJP Office, Bandi Sanjay Telangana Liberation Day Celebrations, Bandi Sanjay Participates at BJP Office, Telangana National Unity Vajrotsavam, Holiday on Telangana Day, Telangana Jathiya Samaikyatha Vajrotsavalu, Jathiya Samaikyatha Vajrotsavalu, Mango News, Mango News Telugu, CS And DGP Reviews Telangana Day Arrangements, Telangana Day, Telangana Day 2022, Telangana Jathiya Samaikyatha Vajrotsavalu 2022, Telangna CM KCR, Telangna Day Latest News And Live Updates, Telangana

తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ శనివారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ‘తెలంగాణ విమోచన దినోత్సవం’ వేడుకల్లో పాల్గొన్నారు. ముందుగా జాతీయ పతాకాన్ని ఎగరవేసిన బండి తెలంగాణ స్వాతంత్య్రం కోసం పోరాడిన వీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17ను నిర్వహించడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం భయపడుతోందని, కేంద్రం ప్రకటించేవరకూ దీనిని జరపాలనే ఆలోచన కూడా చేయలేదని మండిపడ్డారు. ప్రధాని మోదీ ఎప్పుడైతే తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలని నిర్ణయించుకున్నారో, అప్పుడు మేలుకుని వెంటనే ఇంకో పేరుతో సెప్టెంబర్ 17ను నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు.

తెలంగాణ విమోచన దినోత్సవం జరపకపోవడం అంటే తెలంగాణ ప్రజలను అవమానపరచడమేనని సంజయ్ స్పష్టం చేశారు. నాటి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన కొమురం భీమ్, సర్వాయి పాపన్న, చాకలి ఐలమ్మలు తెలంగాణ పౌరుషానికి ప్రతీకలని, భావి తరాలకు తరగని స్ఫూర్తి అని వ్యాఖ్యానించారు. అలాగే కేంద్రం ఆధ్వర్యంలో, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా నిర్వహిస్తోన్న పరేడ్ గ్రౌండ్స్ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ ను కూడా ఆహ్వానించామని వెల్లడించారు. ఇక ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇంచార్జి తరుణ్ ఛుగ్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, విజయశాంతి సహా పలువురు బీజేపీ నేతలు, మహిళా నాయకులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here