ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌కండ్‌లో ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య కీలక భేటీ

PM Modi Meets President of Russian Federation Vladimir Putin in Samarkand Uzbekistan, PM Modi Meets Vladimir Putin, PM Modi Meets President of Russia, Russian Federation Vladimir Putin, Vladimir Putin, President of Russian Federation Vladimir Putin , PM Modi in Samarkand Uzbekistan, PM Modi And Vladimir Putin Meet, Mango News, Mango News Telugu, Vladimir Putin, PM Modi, Indian Prime Minister Narendra Modi, PM Modi Latest News And Updates

ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌కండ్‌లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) 22వ సమావేశం సందర్భంగా శుక్రవారం రాత్రి రష్యా ఫెడరేషన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్‌ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలిశారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య వివిధ స్థాయిలలోని సంప్రదింపులు సహా ద్వైపాక్షిక సంబంధాలలో స్థిరమైన పురోగతిని ఇరువురూ నాయకులు అభినందించారు. ఈ నెల ప్రారంభంలో వ్లాడివోస్టాక్‌లో జరిగిన ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్‌లో ప్రధాని మోదీ వీడియో సందేశానికి అధ్యక్షుడు పుతిన్ ప్రశంసలు తెలిపారు. ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన ముఖ్యమైన సమస్యలతో పాటు ప్రాంతీయ మరియు అంతర్జాతీయ ఆసక్తికర అంశాలపై నేతలు చర్చించారు.

ప్రస్తుత భౌగోళిక-రాజకీయ పరిస్థితుల నుండి ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో ప్రపంచ ఆహార భద్రత, ఇంధన భద్రత మరియు ఎరువుల లభ్యతపై కూడా చర్చలు జరిగాయి. అలాగే ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న సంఘర్షణ నేపథ్యంలో శత్రుత్వాలను త్వరగా విరమించుకోవాలని మరియు సంభాషణ మరియు దౌత్యం యొక్క ఆవశ్యకతను ప్రధాని మోదీ మరోసారి పునరుద్ఘాటించారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాల స్థాపన జరిగి 75 సంవత్సరాలు అవుతుండగా, ఈ ఏడాది ఇరువురు నేతల మధ్య జరిగిన తొలి సమావేశం ఇదే కావడం విశేషం. అనంతరం సంప్రందింపుల్లో ఉండటానికి ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ అంగీకరించారని ప్రధానిమంత్రి కార్యాలయం ప్రకటించింది. అలాగే ఉజ్బెకిస్థాన్ ప్రెసిడెంట్ షావ్కత్ మిర్జియోయేవ్, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, రిపబ్లిక్ ఆఫ్ టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్ తో కూడా ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here